నిన్న “వార్ 2” ప్రీరిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ “తాతయ్య ఆశీస్సులు ఉన్నంతవరకు నన్నెవరూ ఆపలేరు” అని ఇచ్చిన స్టేట్మెంట్ చర్చనీయాంశం అయ్యింది. ఎన్టీఆర్ కౌంటర్ ఎవరికి ఇచ్చాడు? అసలు అన్నది ఎవర్ని? అనాల్సిన అవసరం ఏమొచ్చింది? వంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చెప్పాలంటే ఎన్టీఆర్ నిన్న చాలా బ్యాలెన్స్ తో మాట్లాడాడు. మొదటిసారి ఒక సీనియర్ హీరోతో కలిసి నటిస్తుండడం, హృతిక్ రోషన్ ను ఎక్కడా తక్కువ చేయకుండా, ఇంకా చెప్పాలంటే అతనికి భారీ ఎలివేషన్ ఇస్తూ చాలా హుందాగా మాట్లాడాడు తారక్.
అయితే.. నన్నెవరూ ఆపలేరు, వాళ్ళేవో అంటూ ఉంటారు అంటూ తారక్ అన్నది యాంటీ ఫ్యాన్స్ నా లేక ఇంకెవరినైనా అనే విషయంలో క్లారిటీ లోపించింది. సినిమా రివ్యూల మీద ఎన్టీఆర్ ఎప్పుడూ చాలా ఘాటుగా స్పందిస్తూ వచ్చాడు. “జై లవకుశ” ఈవెంట్లో రివ్యూయర్లను దారినపోయే దానయ్యలతో పోల్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే.. ఈసారి మాత్రం రివ్యూలను, రివ్యూయర్లను కాకుండా ఎవరికో గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది ఎవరు అనేది ఫ్యాన్స్ చాలా థియరీస్ అనుకుంటున్నారు కానీ..
అసలైన టార్గెట్ ఎవరు అనేది మాత్రం తారక్ కి మాత్రమే తెలుసు. ఇకపోతే.. ఇవాళ నుండి “వార్ 2” బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం మీద ఎన్టీఆర్ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. బాలీవుడ్ ఎంట్రీ కావడంతో ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలా క్రూషియల్ గా మారనుందని చెప్పాలి. “వార్ 2″లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి పాజిటివ్ టాక్ వచ్చి, సినిమా హిట్ అయ్యిందంటే మాత్రం ఎన్టీఆర్ బాలీవుడ్ లో పాతుకుపోవడం ఖాయం. మరో 3 రోజుల్లో రిజల్ట్ తెలిసిపోతుంది కాబట్టి ఆగస్ట్ 14 కోసం వెయిట్ చేద్దాం.