ప్రముఖ టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ కొద్దిసేపటి క్రితం మరణించారు. మూడురోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అయన గచ్చిబౌలిలోని ఏ.ఐ.జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తుంది. గత కొంతకాలం క్రితం పక్షవాతం బారిన పడిన కోడిరామకృష్ణ తరువాత కోలుకొని మెల్లగా నడవడం మొదలుపెట్టారు. అయితే ఈసారి పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ కి తరలించారు.
కోడి రామకృష్ణ .. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అయన జన్మించారు. 100 కు పైగా చిత్రాలని రూపొందించిన డైరెక్టర్ గా కోడి రామకృష్ణ రికార్డు సృష్టించారు. 1982లో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ ఆ తరువాత అగ్ర హీరోలతో టాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలను తెరకెక్కించారు. ‘మంగమ్మ గారి మనవడు’ ‘అంకుశం’ ‘శత్రువు’ ‘అమ్మోరు’ ‘అరుందతి’ ‘దేవి’ వంటి చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇటీవల పుట్టపర్తి సాయిబాబా జీవిత ఆధారంగా ఓ చిత్రాన్ని మొదలుపెట్టినప్పకీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. ఆ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టలేదు. ఈ వార్త తెలిసిన కొందరు సినీ ప్రముఖులు హాస్పిటల్ కి చేరుకున్నట్లు సమాచారం. కోడి రామకృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాద వాతావరణం నెలకొంది.