Tollywood: క్రేజీ అంటే క్రేజీ కాంబినేషన్స్‌ ఇవి… నిజమైతే ఫ్యాన్స్‌కి పండగే!

కొన్ని కాంబినేషన్‌ల గురించి వినగానే వావ్ అనిపిస్తుంది. మరికొన్ని కాంబినేషన్ల గురించి వినగానే ‘ఇది కాదా కావాల్సిన కాంబినేషన్‌ అనిపిస్తుంది?’. ఇంకొన్ని కాంబినేషన్ల గురించి వినగానే ‘ఇదేంటి కాంబినేషన్‌రా బాబూ బుర్రపాడ్‌’ అనాలని అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి కాంబో ఒకటి కుదురుతుందని, ఆ కాంబోలో సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు కాబట్టి. ప్రస్తుతం ఇలాంటి రెండు కాంబినేషన్‌ల గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతుంది. మాస్‌ హీరో, మాస్‌ దర్శకుడు… ఇదో రకం కాంబినేషన్‌.

మాస్‌ హీరో, క్లాస్‌ దర్శకుడు ఇది ఇంకో రకం కాంబినేషన్‌. అయితే మాస్‌ హీరో విత్‌ ఊర మాస్‌ దర్శకుడు… మాస్‌ హీరో విత్‌ క్లాస్‌ మాస్‌ దర్శకుడు గురించి విన్నారా? ఇప్పుడు చర్చలో ఉన్న కాంబినేషన్లు అలాంటివి. ఇవి ఓకే అవుతాయా? సినిమాలొస్తాయా? అనేది తెలియదు కానీ.. వస్తే మాత్రం అంతకుమించిన ఫీస్ట్‌ అభిమానులకు ఉండదు. ప్రభాస్‌ కటౌట్‌ చూసినప్పుడల్లా…

ఈ డైనోసార్‌కి బోయపాటి లెవల్‌ షాట్స్‌, ఎలివేషన్లు పడితే బాగుండు అనుకున్నారా ఎప్పుడైనా? ఒకవేళ అనుకుని ఉంటే ఆ కల నెరవేరే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ కాంబో డిస్కషన్‌ నడుస్తోంది అంటున్నారు. ప్రభాస్‌ – బోయపాటి శ్రీను కలయికలో ఓ సినిమా ఉండొచ్చు అంటున్నారు. అలాగే చరణ్‌ (Ram Charan) లాంటి స్టార్‌కి, త్రివిక్రమ్‌ లాంటి రైటింగ్‌ పడితే పంబరేగిపోద్ది అనుకున్నారా? అయితే ఇది కూడా నెరవేరేలా ఉంది.

ఎందుకంటే ‘గుంటూరు కారం’ తర్వాత బన్నీ సినిమా చేయాల్సిన త్రివిక్రమ్‌ ఆ సినిమాను కాస్త పక్కనపెట్టి వేరే ప్రాజెక్ట్‌ ప్లాన్స్‌లో ఉన్నారు అని టాక్‌. ఆ క్రమంలో రామ్‌చరణ్‌తో సినిమా అని అంటున్నారు. నిజానికి చిరు – త్రివిక్రమ్‌ కాంబో కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్‌. ఇప్పుడు అది చరణ్‌ – త్రివిక్రమ్‌ అయితే చాలా హ్యాపీ. చూద్దాం మరి ఈ కాంబినేషన్ల చర్చలు ఎంతవరకు వస్తాయో? ఒకవేళ వచ్చినా ఎప్పుడు ప్రారంభమవుతాయో. ఎందుకంటే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ప్రస్తుతం చాలా బిజీ.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus