మరోసారి వివాదంలో చిక్కుకున్న హీరోయిన్.. కారణం అదే..!

హీరోయిన్ సంజన గల్రాని అందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా ఈమె చేసినవి తక్కువ సినిమాలే..! కానీ సినిమాలతో కంటే కూడా వివాదాలతోనే ఈమె నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది అన్నది అక్షర సత్యం. మొన్నామధ్య డ్రగ్స్ కేసులో చిక్కుకొని నానా ఇబ్బందులు పడింది ఈ బ్యూటీ. జైలు శిక్ష కూడా అనుభవించి ఈ మధ్యనే బెయిల్ పై బయటకి వచ్చింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె ఓ క్యాబ్ డ్రైవర్‌తో గొడవపెట్టుకొని మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది. విషయంలోకి వెళితే..

మంగళవారం ఉదయం షూటింగ్‌ కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న సంజన…. క్యాబ్‌ ఎక్కిన తర్వాత వెళాల్సిన లొకేషన్ మార్చాలని డ్రైవర్‌ ను కోరింది. సంజన కోరిక మేరకు ఓసారి కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి అడిగాడు ఆ క్యాబ్ డ్రైవర్. కానీ వాళ్ళు లొకేషన్‌ మార్చడానికి నిరాకరించారు. దీంతో సంజన డ్రైవర్ ను తిట్టడం మొదలుపెట్టింది. అతను డిఫెండ్ చేసుకుని దయచేసి క్యాబ్ దిగండి మేడం అని తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. అతని పై గొడవకి దిగింది.

దీంతో ఆ డ్రైవర్‌ చేసేది ఈమె లేక ఆమె ప్రవర్తనని వీడియో తీసి పోలీసులని ఆశ్రయించాడు. అయితే సంజన మాత్రం ‘నేను చెప్పిన లొకేషన్ కు ఆ డ్రైవర్ తీసుకువెళ్లలేదని’ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. అంతేకాదు ‘కారులో ఏసీ పెంచమని అడిగినా డ్రైవర్ నిరాకరించినట్టు ఆమె చెప్పుకొచ్చింది. ‘అడిగినంత డబ్బు ఇచ్చినప్పటికీ….అతను అలా చేయడం సరైన పద్ధతి కాదు అని… ఆమె 100కు ఫోన్‌ చేసి ఆ డ్రైవర్ పై కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఎవరి మాట నిజమో తెలీదు కానీ.. ఈ టాపిక్ ద్వారా సంజన మరోసారి వార్తల్లో నిలిచింది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Share.