టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. జావెలిన్ త్రో ఫైనల్స్ లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. వందేళ్ల తరువాత భారత్ తరఫున అథ్లెటిక్స్ ఫీల్డ్ అండ్ ట్రాక్ విభాగంలో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. 23 ఏళ్ల నీరజ్ చోప్రా తొలిసారి ఒలింపిక్స్ అడుగుపెట్టి అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, వెంకటేష్, రాజమౌళి సహా పలువురు ప్రముఖులు నీరజ్ చోప్రాను అభినందించారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘ఇది భారత్ కు అద్భుతమైన విజయం. ఈ క్షణం రావడానికి 101 ఏళ్లు పట్టింది. నీరజ్ చోప్రా.. మీరు చరిత్ర లిఖించడమే కాదు.. చరిత్రను తిరగరాశావు’ అంటూ ప్రశంసలు జల్లు కురిపించారు.
‘అథ్లెటిక్స్‌లో ఇది భారత్‌కు మొదటి గోల్డ్. ఇది ఎంతో ఉత్తేజభరితమైన, గర్వమైన క్షణం. నీరజ్ చోప్రా.. ఈ పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది’ అంటూ మహేష్ బాబు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘సూపర్ సూపర్ విన్’ అంటూ వెంకటేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇంకా ఒక్కొక్కరూ తమ స్టైల్ లో నీరజ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Kudos to all the participants who represented our Country at the Olympics including the families & the coaches.
I truly respect your dedication & motivation.
India is proud of all of you!
Jai Hind@Olympics#Tokyo2020