కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది.దీని సంగతి ఇక అయిపొయింది అని సంతోషించేలోపు.. గతేడాది కంటే ఇది వేగంగా వ్యాప్తిస్తుండడం గమనార్హం. సామాన్యులనే కాదు సెలబ్రిటీలను కూడా ఇది విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు దీని భారిన పడ్డారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలకు కూడా కరోనా సోకడం ఏంటి? అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. వాళ్లకు నిమిష నిమిషానికి శానిటైజ్ చెయ్యడానికి మనుషులు ఉంటారు. అలాంటివాళ్లే కరోనా భారిన పడుతుంటే సామాన్యుల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు.
సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి సెకండ్ వేవ్ లో కరోనా భారిన పడిన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) పవన్ కళ్యాణ్ :
‘వకీల్ సాబ్’ చిత్రం విడుదలైన తరువాత పవన్ కళ్యాణ్ కరోనా భారిన పడ్డాడు. తరువాత అతని ఫామ్ హౌస్ లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. రాంచరణ్, చిరు.. అపోలో యాజమాన్యంతో మాట్లాడి వైద్య నిపుణులను ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ ఇవ్వడంతో కోలుకున్నాడు.
2) అల్లు అర్జున్ :
మన బన్నీ కూడా ఇటీవల కరోనా భారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతను తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు అతను తాజాగా తెలియజేసాడు.ఇంకా సెల్ఫ్ ఐసొలేషన్లోనే ఉన్నాడట.
3) దిల్ రాజు :
ఇటీవల సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కరోనా భారిన సంగతి తెలిసిందే. అటు తరువాత హోమ్ ఐసొలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నాడు.
4) నివేదా థామస్:
‘వకీల్ సాబ్’ ప్రొమోషన్ల టైంలోనే ఈమె కూడా కరోనా భారిన పడింది. అయితే త్వరగానే కోలుకుంది లెండి.
5) అల్లు అరవింద్ :
ఇటీవల అల్లు అరవింద్ గారు కూడా కరోనా భారిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఇతను కరోనా భారిన పడ్డాడు. అయితే వ్యాక్సిన్ వల్లనే ఇతను త్వరగా కోలుకున్నట్టు ఆయన తెలియాజేసాడు.
6) పూజా హెగ్డే:
టాలీవుడ్ బుట్ట బొమ్మ.. కరోనా భారిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల్లోనే ఈమె కోలుకుంది.
7) బండ్ల గణేష్:
టాలీవుడ్ నిర్మాత, కమెడియన్ అయిన బండ్ల గణేష్.. రెండో సారి కూడా కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. అదృష్టం కొద్దీ అతను కోలుకున్నాడు.
8) విజయేంద్ర ప్రసాద్:
రాజమౌళి తండ్రి.. ప్రముఖ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ కూడా కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే.
9) అలియా భట్:
‘ఆర్.ఆర్.ఆర్’ హీరోయిన్ అలియా భట్ కూడా కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులు ట్రీట్మెంట్ తీసుకుని ఆమె కోలుకుంది.
10) రమేష్ వర్మ:
రవితేజతో ‘ఖిలాడి’ చిత్రం తెరకెక్కిస్తున్న దర్శకుడు రమేష్ వర్మ కూడా కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే.