లవ్ జంట.. మరోసారి తెరపైకి..?
- November 12, 2016 / 05:44 AM ISTByFilmy Focus
గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో నాగచైతన్య, సమంత ఒకరికొకరు పరిచయమయ్యారు. ఈ సినిమాతో సమంత ఎంట్రీలోనే హిట్ కొడితే, చైతూ తొలి విజయాన్ని రుచి చూశాడు. వీటన్నిటికీ మించి ఈ ఇద్దరి మధ్య బంధం పెళ్లి పీటలెక్కే వరకు చేరుకుంది. ‘ఏ మాయ చేశావే’ తర్వాత ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ సినిమాల్లో జంటగా నటించిన వీరిద్దరూ మళ్ళీ ఓ సినిమా చేస్తే..? ఇదే ప్రశ్న ఓ పాత్రికేయుడు ఇటీవల చైతూ ముందుంచగా.. కిందివిధంగా స్పందించాడు.
సమంతతో నటించడానికి ఎటువంటి సమస్య లేదు. పెళ్ళికి ముందైనా, తర్వాతైనా సమంతతో సినిమా చేయడానికి నేను రెడీ. కావాల్సిందల్లా దానికి సరిపడా మంచి స్క్రిప్ట్. అటువంటి కథతో దర్శకులెవరైనా మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా చేస్తాం అని బదులిచ్చాడీ అక్కినేని హీరో. చైతూ అన్నదీ నిజమే.. ఇప్పటికే మూడు విభిన్న కథల్లో మెప్పించారు ఈ లవ్ జంట. మరో సినిమా చేయాలంటే అందులో ఏదో విషయం ఉండి తీరాలి. వీరిద్దరి కలయికలో ఇప్పుడు ఎవరైనా సినిమా చేయాలే గానీ కాసుల వర్షం గ్యారెంటీ. వరుస సినిమాలు చేస్తూ సమంతతో మంచి సాన్నిహిత్యం ఏర్పరుచుకున్న ట్రెండీ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ క్రేజీ కాంబినేషన్ ని తెరపైకి తీసుకొస్తారేమో చూడాలి. అప్పట్లో త్రివిక్రమ్ – నాగచైతన్య కలయికలో సినిమా అంటూ గుసగుసలు వినిపించిన సంగతి గుర్తుందిగా!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















