ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తుంటే మరికొన్ని సినిమాలు మాత్రం అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నాయి. అయితే ఇదే సమయంలో కన్నడలో తెరకెక్కిన పలు సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. కాంతార సినిమా చిన్న సినిమాగా విడుదలై ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో తెలిసిందే.
అల్లు అరవింద్ చాలా తక్కువ మొత్తానికి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయగా ఈ సినిమా ద్వారా ఆయనకు ఊహించని స్థాయిలో లాభాలు దక్కనున్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా అందించని స్థాయిలో కాంతార సినిమా అల్లు అరవింద్ కు లాభాలను అందించిందని తెలుస్తోంది. మన టాలీవుడ్ డైరెక్టర్లలో అందరూ కాకపోయినా కొంతమంది డైరెక్టర్లు ఇందుకు సంబంధించి మారాల్సి ఉంది. కథలో కొత్తదనం, ప్రేక్షకుల అంచనాలకు అందని కథనం, అద్భుతమైన అభినయం, ఆసక్తికర ట్విస్టులు సినిమా సక్సెస్ విషయంలో కీలక పాత్ర పోషిస్తుండటం గమనార్హం.
ఇవి లేకుండా దర్శకులు ఎంత భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించినా ఫలితం అయితే ఉండదని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కినా కంటెంట్ ఆసక్తికరంగా లేకపోవడం వల్ల ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. కాంతార సక్సెస్ తో రిషబ్ శెట్టి గతంలో నటించిన సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేయాలని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నారు.
రిషబ్ శెట్టి కమర్షియల్ గా సక్సెస్ సాధించడం కంటే విలువలతో కూడిన సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రిషబ్ శెట్టి తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు రిషబ్ శెట్టికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.