దేశ ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారీ మార్పులనే తెచ్చింది….అన్ని రంగాలతో పాటు…సినిమా రంగం కూడా భారీగానే నష్ట పోయింది. అయితే అదే క్రమంలో చాలా సినిమాలు సెట్స్ పైనే ఆగిపోయాయి…మరికొన్ని సినిమాలు మొత్తం పూర్తయ్యి రిలీజ్ కోసం ఆతురతగా ఎదురు చూస్తున్నాయి…అయితే సడన్ గా ఆ నిర్ణయంతో అయోమయం అయిపోయిన పరిస్థితుల్లో చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు…కాదు కాదు…భయపడి….వాయిదా పడ్డాయి…అయితే క్రమక్రమంగా పరిస్థితులు చక్కబడటంతో…ఇప్పుడిప్పుడే సినిమాల విడుదలపై కొంత క్లారిటీ వచ్చినట్లు సమాచారం…అయితే ఈ దెబ్బకు చిన్న సినిమాతో పాటు…బడా సినిమా ధృవ కూడా కాస్త లేట్ గా వస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే వాయిదా పడి…ఇప్పుడు విడుదలకు సిద్దం అవుతున్న సినిమాల వివరాల్లోకి వెళితే…ప్రముఖ కమీడీయన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన రెండో సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’పై భారీ అంచనాలే ఉన్నాయి…ఈ సినిమా కాస్త గ్యాప్ తరువాత ఈ శుక్రవారం విడుదలకు సిద్దం అయ్యింది . ఇక అదే క్రమంలో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు సైతం శుక్రవారం రేసులో ఉన్నాయి. అందులో ఒకటి ‘రెమో’ కాగా…మరొకటి జీవా మూవీ ‘రంగం-2’…ఇదిలా ఉంటే ఆ తర్వాత వారంలో….విజయ్ ఆంటోనీ నటించిన ‘బేతాళుడు’ సినిమా విడుదల కానుంది…ఇక వెనువెంటనే….ఆ శుక్రవారం మోహన్ లాల్ హీరోగా నటించిన మరో డబ్బింగ్ మూవీ ‘మన్యం పులి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మన అల్లరోడు అల్లరి నరేశ్ నటించిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ డిసెంబర్ 2న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు…ఇక ఆ తరువాత పండగ అంతా…మన మెగా పవర్ స్టార్ రామ్ చరన్ దే….’ధృవ’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు… అంటే రానున్న వారాల్లో టాలీవుడ్ లో మళ్లీ సందడి మొదలవనుంది అన్న మాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.