భారతదేశంలో సూపర్ హీరో సినిమాలకు కొత్త ట్రెండ్ ను చూపిన క్రిష్ (Krrish) ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా వచ్చిన ఈ సిరీస్ మూడు భాగాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇక నాలుగో భాగంపై గత కొన్నేళ్లుగా అనేక ఊహాగానాలు జరుగుతూనే ఉన్నాయి. దర్శకుడు రాకేష్ రోషన్ ఈ ప్రాజెక్ట్‌ను మరింత గ్రాండ్‌గా చేయాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా, క్రిష్ 4 (KRRISH 4) కోసం స్టోరీ లాక్ చేసుకున్నారని, పూర్తి స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ సినిమా పూర్తిగా అంతరిక్షం నేపథ్యంలో సాగుతుందని, గ్రాఫిక్స్, టెక్నికల్ వర్క్ కోసమే భారీ బడ్జెట్ అవసరమవుతుందని రాకేష్ రోషన్ వెల్లడించారు. రాజీ పడకుండా ప్రొడక్షన్ వెనుకబడకుండా, కావాల్సినంత బడ్జెట్ సమకూర్చేందుకు కొత్త భాగస్వాములు అవసరం ఉంటుందని ఆయన హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) – కళ్యాణ్ రామ్‌లు (Nandamuri Kalyan Ram) నిర్మాణ భాగస్వాములుగా మారతారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2లో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఎన్టీఆర్, హృతిక్ మధ్య మంచి స్నేహం ఏర్పడినట్లు సమాచారం. ఇదే కారణంగా క్రిష్ 4 ప్రాజెక్ట్‌లో కూడా ఎన్టీఆర్ ఇన్వెస్ట్ చేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ మాత్రమే కాదు, ఈ బిజినెస్‌లో కళ్యాణ్ రామ్, హరి కృష్ణ క్రియేషన్స్ కూడా భాగస్వాములు కావొచ్చని ప్రచారం సాగుతోంది.
బాలీవుడ్ మార్కెట్‌పై ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తి దృష్టి పెట్టడంతో, ఒకవేళ క్రిష్ 4 (Krrish) నిర్మాణంలో భాగమైతే, ఇది అతనికి మరో పెద్ద అడుగు అవుతుంది. వార్ 2 విడుదలయ్యే సరికి హృతిక్ మార్కెట్ మరింత పెరిగితే, క్రిష్ 4 మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. మొత్తానికి, ఎన్టీఆర్ – హృతిక్ మధ్య ఏర్పడిన స్నేహం వారి సినిమాలకే కాకుండా ప్రొడక్షన్ లెవెల్‌లోనూ కలిసి పనిచేసే స్థాయికి తీసుకెళ్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇది నిజమైతే టాలీవుడ్ లో ప్రత్యేకంగా క్రిష్ 4ను ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది.