Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వంద చిత్రాలు పూర్తి చేసిన తెలుగు హీరోలు

వంద చిత్రాలు పూర్తి చేసిన తెలుగు హీరోలు

  • January 18, 2017 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వంద చిత్రాలు పూర్తి చేసిన తెలుగు హీరోలు

వందకి వంద మార్కులు సాధిస్తే మంచి విద్యార్థి అని అభినందిస్తారు. క్రికెట్ లో వంద రన్స్ చేస్తే భలే ఆడాడురా అంటారు. ఇలా వంద అనే మాటకి ఓ ప్రత్యేక విలువ ఉంది. ఈ విలువ సినిమా వారికి మరింత పెరుగుతుంది. తాము నటించిన చిత్రం వంద రోజులు ఆడితే అన్ని వర్గాల ప్రజలకు నచ్చినట్లు ఆనందపడిపోతారు. మన హీరోలు ప్రతి సినిమా వందరోజులు ఆడాలని కష్టపడుతుంటారు. అంత శ్రమించి వంద చిత్రాలను పూర్తి చేస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి వంద సినిమాల మైలు రాయిని క్రాస్ చేసిన తెలుగు హీరోలపై ఫోకస్.

మోహన్ బాబుMohan Babuడైలాగ్ కింగ్ మోహన్ బాబు అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పుపొందారు. హీరోయిజం చూపించినా, విలనిజం ప్రదర్శించినా తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలికారు. తన కొడుకులు, కూతురు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించి విజయతీరానికి చేర్చారు. ఆయన ఇప్పటివరకు 560 చిత్రాల్లో నటించారు.

కృష్ణKrishnaసూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. ఆయన ఇప్పటివరకు 345 చిత్రాల్లో నటించి అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. తొలితరం హీరోల్లో ఒకరైన కృష్ణ ఇప్పటికీ నటించడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు.

మురళీ మోహన్Murali Mohanసాంఘిక కథల హీరోగా మహిళా ప్రేక్షకుల మనసు దోచుకున్న నటుడు మురళీ మోహన్. ఇతను యవ్వనంలో హీరోగా నటించి అనంతరం వయసుకు తగ్గ పాత్రలలో ఇమిడిపోయారు. ఇప్పటివరకు 350 చిత్రాల్లో నటించారు.

ఎన్టీఆర్NTRమహా నటుడు నందమూరి తారక రామారావు తన నటనతో దేవుళ్లను కళ్ళకు కట్టారు. సాంఘికం, పౌరాణికం అంటూ తేడాలేకుండా అన్ని రకాల కథలతో సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లారు కాబట్టి 303 సినిమాలకే పరిమితయ్యారు కానీ .. లేకుంటే మరో సెంచురీ పూర్తి చేసేవారు.

ఏఎన్నార్ANRఆఖరి శ్వాస ఉన్నంతవరకు నటనే జీవితంగా బతికిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. నూనూగు మీసాలు ఉన్నపుడు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి కొన్ని రోజుల్లో చనిపోతున్నానని తెలిసి కూడా మనం చిత్రంలో నటించారు. ఆఖరి చిత్రం కూడా ఏఎన్నార్ కి బ్లాక్ బస్టర్ అయింది. దీంతో ఆయన నటించిన చిత్రాల సంఖ్య 256 .

కృష్ణంరాజుKrishnam Rajuరెబల్ స్టార్ కృష్ణం రాజు నటనా కాలం ఎక్కువైనప్పటికీ ప్రత్యేకమైన కథలనే ఎంపిక చేసుకొని ఎక్కువ విజయాలను సొంతం చేసుకున్నారు. 197 చిత్రాల్లో నటించిన ఈయన అతి త్వరలో 200 మైలు రాయిని క్రాస్ చేయనున్నారు.

చిరంజీవిChiranjeeviమెగాస్టార్ చిరంజీవి హీరోగా ఖైదీ నంబర్ 150 సినిమాతో 150 చిత్రాలను పూర్తి చేశారు. పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ స్కోర్ తక్కువగా ఉంది కానీ లేకుంటే చిరు టు సెంచరీ ఎప్పుడో చేసేవారు.

రాజేంద్ర ప్రసాద్Rajendra Prasadఅప్పట్లో రోజుకు మూడు చిత్రాల్లో నటించిన బిజీ హీరో నవ్వుల కిరీటి రాజేంద్ర ప్రసాద్. చాలా వేగంగా అనేక సినిమాలు పూర్తి చేశారు. హీరోగా దాదాపు 150 చిత్రాలు చేశారు. క్యారక్టర్ ఆర్టిస్టుగా మరో 45 చిత్రాల్లో కనిపించారు.

శోభన్ బాబుShoban Babuసోగ్గాడు శోభన్ బాబు అందంతో, అభినయంతో మహిళా హృదయాలను గెలుచుకున్నారు. ఇతను క్యారక్టర్ ఆర్టిస్టుగా చేయలేదు. ప్రధాన పాత్రల్లో నటిస్తూ 120 చిత్రాలను కంప్లీట్ చేశారు. అభిమానుల కోసం వృద్యాప్యంలో నటించకూడదని నిర్ణయం తీసుకొని కలల రాకుమారిడిగా మిగిలి పోయారు.

బాలకృష్ణBalakrishnaతన వందో చిత్రం స్థిరస్థాయిగా మిగిలిపోయేలా నటసింహ నందమూరి బాలకృష్ణ కథను ఎంచుకున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణిగా వచ్చి విజయం అందుకోవడమే కాదు.. వంద కోట్ల క్లబ్బులో చేరి తెలుగు సినీ చరిత్రలో బాలయ్య వందో చిత్రం ఓ పేజీ దక్కించుకుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ANR
  • #ANR Movies
  • #Balakrishna
  • #Balakrishna Movies
  • #Chiranjeevi

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

4 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

5 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

4 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version