24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న ట్రైలర్స్
- August 19, 2017 / 12:58 PM ISTByFilmy Focus
ప్రస్తుతం సినిమా విజయంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. థియేటర్లోకంటే ముందుగానే ఇక్కడే టీజర్, ట్రైలర్ రూపంలో సినిమాలపై అభిప్రాయం మొదలవుతోంది. పైగా భారీ ఓపెనింగ్స్ కి ఇక్కడి వ్యూస్ ఆధారమవుతున్నాయి. అందుకే ఇక్కడి రికార్డ్స్ ని కూడా పరిగణలోకి తీసుకోకతప్పడం లేదు. కొంతకాలంగా తెలుగు చిత్రాల ట్రైలర్లు యూట్యూబ్లో హంగామా సృష్టిస్తున్నాయి. ఒక్కరోజులోనే లక్షల వ్యూస్ అందుకొని ఔరా అనిపిస్తున్నాయి. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన చిత్రాల్లో మొదటి స్థానం బాహుబలి కంక్లూజన్ సొంతం చేసుకుంది. రెండు కోట్ల 17 లక్షల వ్యూస్ అందుకొని ఆశ్చర్య పరిచింది. తర్వాతి స్థానంలో అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం నిలిచింది.
ఈ మూవీ ట్రైలర్ ని విడుదలయిన ఒక్కరోజులో 46 లక్షల సార్లు చూసారు. అలాగే బాలకృష్ణ లేటెస్ట్ మూవీ పైసా వసూల్ ట్రైలర్ అన్ని సినిమా రికార్డ్స్ ని దాటుకొని మూడవ స్థానాన్నికైవశం చేసుకుంది. ఇది ఒక్కరోజులో 29 లక్షల వ్యూస్ అందుకుంది. ఇక నాలుగు, ఐదవ స్థానాల్లో అన్నదమ్ముల చిత్రాలు నిలిచాయి. 24 లక్షల వ్యూస్ తో ఖైదీ నంబర్150 , 21 లక్షల వ్యూస్ తో కాటమరాయుడు టాప్ 5 లో చోటు దక్కించుకున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















