టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కి పోటీపడే హీరోలలో మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్నీలు ఉన్నారు. పవన్ రాజకీయలకు పరిమితమై పోతాడు ఈ రేసులోకి రాడని అందరూ భావించారు. ఐతే ఆయన కమ్ బ్యాక్ ఇవ్వడంతో పాటు ఏకంగా మూడు సినిమాలు ప్రకటించారు. దీనితో ఈ రేస్లో మళ్ళీ ఆయన కూడా వచ్చి చేరినట్లయింది. మరి వీరిలో ఎవరు నంబర్ వన్ అంటే ఎవరికి వారు మా హీరో నంబర్ వన్ అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు హీరో నంబర్ వన్ అన్నట్లు ఫీల్ అవుతారు, ఎదుటివారితో వాదానికి దిగుతారు.
మరి ఈ స్టార్ డమ్ కి ఒక కొలమానం, ప్రామాణికం ఉన్నప్పుడు ఎవరైనా ఒప్పుకోవలసిందే. బాలీవుడ్ లో అక్కడ స్టార్ హీరోల స్టార్ డమ్, సినిమాల రేటింగ్, ఫేమ్ అంచనా వేయడానికి ఓ సంస్థ ఉంది. ఒర్మాక్స్ మీడియా అనే ఈ సంస్థ లెక్కల ప్రకారం మహేష్ స్టార్ డమ్ లో అందరికంటే ముందున్నాడు. ఆ సంస్థ సర్వే ప్రకారం ఫాలోయింగ్ మరియు స్టార్ డమ్ లో మహేష్ అందిరికంటే ముందున్నాడట. గత మార్చి నెల వరకు వారి ట్రాకింగ్ ప్రకారం అత్యధిక పాయింట్స్ సాధించిన మహేష్ మొదటి స్థానం ఆక్రమించాడట.
ఇక సంక్రాంతి పోరులో మహేష్ తో తలపడిన అల్లు అర్జున్ సెకండ్ ప్లేస్ సాధించడం గమనార్హం. ఇక మన పాన్ ఇండియా స్టార్ ఎక్కడనేగా మీ డౌట్.. ఆయన గత చిత్రం సాహో బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన కూడా మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రెండేళ్ల నుండి ఒక్క సినిమాలో నటించని పొలిటీషియన్ కమ్ యాక్టర్ పవన్ నాలుగవ స్థానం పొంది తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇక యంగ్ టైగర్ తృటిలో టాప్ 5ప్లేస్ నుండి జారిపోకుండా కాపాడుకున్నాడు. చిరు, చరణ్ ఆరు, ఏడు స్థానాలకు పరిమితం కావడం గమనార్హం. సెన్సేషనల్ విజయ్ దేవరకొండ ఎక్కడనేగా మీ డౌట్.. పాపం ఆయన తొమ్మిదవ స్థానంతో సరిపెట్టుకున్నారు.