కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏడు పదుల వయస్సులో కూడా రజనీకాంత్ వరుసగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రజనీకాంత్ సినిమాలకు హిట్ టాక్ వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొత్త రికార్డులు క్రియేట్ కావాల్సిందేననే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఓటీటీల హవా వల్ల టీవీలలో సినిమాలకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావడం లేదు. అయితే రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటైన పడయప్ప(నరసింహ) సినిమాను స్పెషల్ ప్రీమియర్ గా వేస్తే ఈ సినిమాకు ఏకంగా 22 రేటింగ్ వచ్చింది.
భారీ బడ్జెట్ సినిమాలు తొలిసారి ప్రసారమైన సమయంలో కూడా ఈ స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకోలేక ఫెయిల్ అవుతున్న సంగతి తెలిసిందే. పడియప్ప సినిమా మాత్రం మంచి రేటింగ్ ను సొంతం చేసుకుని సన్ టీవీకి ప్లస్ అయింది. దీపావళి పండుగ సందర్భంగా సన్ టీవీ అరుణాచలం రీమాస్టర్ ప్రింట్ ప్రసారమవుతోంది. టాలీవుడ్ దర్శకనిర్మాతలు సైతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల రీమాస్టర్ ప్రింట్లను టీవీలో ప్రసారం చేస్తే
ఆ సినిమాలు మంచి రేటింగ్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది. చిరంజీవి, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్, మహేష్ బాబు, బన్నీ 15 సంవత్సరాల క్రితం నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల రీమాస్టర్ ప్రింట్లను ప్రసారం చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ విధంగా చేయడం వల్ల బుల్లితెరపై ప్రసారమయ్యే సినిమాల రేటింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ నిర్మాతలుఈ విధంగా చేస్తారో లేదో చూడాల్సి ఉంది. స్టార్ హీరోల పాత సినిమాలకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొనడం గమనార్హం.