ప్రముఖ సింగర్ కల్పన (Kalpana) ఆత్మహత్యాయత్నం చేయడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. నిద్ర మాత్రలు మింగిన ఆమెను అపార్ట్‌మెంట్ వాసులు హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి క్లారిటీ రావాల్సి ఉంది. కల్పన (Kalpana) నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిల్లేజ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
రెండు రోజులుగా డోర్ తీయకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు గమనించి డోర్స్ బద్దలు కొట్టారు. ఇక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను ఆస్పత్రికి తరలించగలిగారు. ప్రస్తుతం వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తుండగా, ఆమె ఆరోగ్యం కుదుటపడే అవకాశాలపై ఇంకా స్పష్టత లేదు. కల్పన (Kalpana) స్పృహలోకి వచ్చిన తర్వాత పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అయితే, ఆమె మానసిక స్థితి ఎలా ఉంది? ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.
టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సింగర్లలో కల్పన (Kalpana) ఒకరు. ఆమె తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ పాటలు పాడారు. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేవీ మహాదేవన్ లాంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి పాటలు కూడా పాడారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే పలు సింగింగ్ షోలలో కూడా జడ్జీగా పాల్గొన్నారు.
తాజా సంఘటన ఆమె అభిమానులను షాక్‌కు గురిచేసింది. టాలీవుడ్, సంగీత వర్గాల్లో ఆమె ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. కల్పన పరిస్థితి గురించి తెలుసుకున్న వారు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ సంగీత ప్రియులు, సహా కళాకారులు సోషల్ మీడియాలో మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటికి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి నుంచి పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నట్లు సమాచారం.
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు.
నిద్రమాత్రలు మింగి రెండు రోజులుగా అపస్మారకస్థితిలో ఉన్నారు. ఆమె బయటకు రాకపోవడం, స్పందించకపోవడంతో నిజాంపేటలోని ఆమె నివాసం ఉండే గేటెడ్ కమ్యూనిటీలోని ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి… pic.twitter.com/XJPKvHwzHf
— Filmy Focus (@FilmyFocus) March 4, 2025