మనకి బోర్ కొడితే సినిమాలకి వెళ్తాం. సినిమా వాళ్లకు బోర్ కొడితే..? అంటే హీరో, హీరోయిన్లు ఒత్తిడి పోగొట్టేందుకు ఏమి చేస్తారు.? ఎంజాయ్ చేయడానికి ఎక్కడకు వెళ్తారు..?.. ఇన్ని ప్రశ్నలు ఎందుకు .. వారినే అడిగేస్తే పోలా .. పదండి వాళ్ళేమి చేస్తారో తెలుసుకుందాం.
సితారతో సరదాగా..సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నప్పుడు తీరిక సమయం దొరికితే బ్యాట్ తో దోస్తీ కట్టేవారు. షూటింగ్లో గ్యాప్ దొరికినా క్రికెట్ ఆడుకునే వారు. ఇక ఇంట్లో అయితే టీవీకి అతుక్కుపోయే వారు. ప్రస్తుతం భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార తో గడిపేందుకు ఇష్టపడతారు. “ఇది వరకు గౌతమ్ తో వీడియో గేమ్స్ ఆడుకునే వాన్ని. అతను ఇప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు. నేను సితార తో సరదాగా గడుపుతున్నాను” అని మహేష్ చెప్పారు.
వ్యవసాయం ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. పనులు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. తెలుగులో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్. అయినా ఆ స్టార్ డం ను తన పక్కకి కూడా రానీయరు. షూటింగ్ లేకపోతే రైతుగా మారిపోతారు. హైదరాబాద్ శివార్లలోని తమ ఫాం హౌస్ లో వ్యవసాయం చేస్తుంటారు. సేంద్రీయ పద్ధతుల్లో పంటలు పండిస్తారు. సినిమాల్లో నటించడంకంటే మొక్కల పెంపకమే తనకి సంతృప్తిని ఇస్తుందని ఆయన అనేక సార్లు చెప్పారు.
లాంగ్ డ్రైవ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిన్నప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కువ సమయం రొయ్యల చెరువు వద్ద గడిపేవారు. రొయ్యల పెంపకానికి అవసరమయ్యే పనులను కూడా చేసేవారు. హీరోగా ఎదిగిన తర్వాత భీమవరం వెళ్ళడం తగ్గడంతో ఆక్వా కల్చర్ కి దూరమయ్యారు. ఇప్పుడు టైం దొరికితే స్పోర్ట్స్ కార్లలో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళిపోతారు.
వంట చేస్తూ .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్ లో అలసి పోతే గరిట పట్టుకుంటారు. నచ్చిన రెసిపీ వండి తింటారు. వెజ్ , నాన్ వెజ్ అని తేడా లేకుండా అన్నిరకాల వంటలను చక్కగా వండగలరు. తన భార్య ప్రణతి కి ఇష్టమైన ఫుడ్ సిద్ధం చేసి ప్రేమను కురిపిస్తారంటా. ఇప్పుడు అభయ్ రామ్ కే తన తీరిక సమయం కేటాయిస్తున్నారు.
గుర్రపు స్వారీమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూగ జీవాలతో గడిపేందుకు ఆసక్తి కనబరుస్తారు. పని పూర్తి చేసుకుని ఇంటికి రాగానే పెంపుడు కుక్క పిల్లపై ప్రేమ కురిపిస్తారు. షూటింగ్ లేని రోజు తన మేలు జాతి గుర్రాలపై స్వారీ కి వెళ్తారు. గుర్రాల పై ఎంత సేపు స్వారీ చేసిన రామ్ చరణ్ కి అసలు బోర్ కొట్టదు.
క్రికెట్టే లోకం…నవ యువ సామ్రాట్ అఖిల్ కి ఇష్టమైనవి రెండే రెండు. ఒకటి సినిమా. రెండోది క్రికెట్. స్టార్ క్రికెటర్ సచిన్ వద్ద క్రికెట్ మెళకువలు నేర్చుకున్నారు. చిన్న వయసులోనే సెలబ్రిటీ క్రికెట్ టీం కి కెప్టన్ అయ్యాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కప్ సొంతం చేసుకున్నారు. అఖిల్ కి క్రికెట్ ఉత్సాహాన్ని .. ఉల్లాసాన్ని ఇస్తుంది.
లోకజ్ఞానం కోసంతెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ లో ఒకరైన అనుష్కకు పేపర్ చదవడమంటే చాలా ఇష్టం. ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటి నుంచి బిజీ వల్ల చదవ లేకపోతోంది. అయినా తీరిక దొరికిన రోజు పేపర్లన్నీ ముందు వేసుకుని ఆసక్తి వార్తల్నికత్తిరించి దాచుకుంటుంది. వాటిని అప్పుడప్పుడు తిరగేసుకుని లోకజ్ఞానం పెంచుకుంటుంది.
బంగీ జంప్ అంటే ప్రాణం సాహసాలు చేయడం అబ్బాయిలే కాదు.. అమ్మాయిలూ కూడా ఇష్టమని నటి త్రిష నిరూపించింది. అత్యంత ప్రమాదకరమైన బంగీ జంప్ ను ఇప్పటికే నాలుగు సార్లు చేసింది. అంతే కాదు స్కూబా డైవింగ్ లోనూ ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఇలా ఖాళీ దొరికితే సాహసాలు చేయడమలో త్రిష బిజీ అయిపోతుంది.
బైక్ భామ ..మహా మహా అంటూ కుర్రకారుని అలరించిన చార్మి కి బైక్ రైడింగ్ అంటే భలే ఇష్టం. సినిమాల్లోకి రాక ముందే బైక్ నడపడం నేర్చుకుంది. కాలేజీ రోజుల్లో బైక్ పై మగరాయుడిలా తిరిగేది. “జ్యోతిలక్ష్మి” సినిమాలో చార్మి బులెట్ నడిపించి చూపించింది. చార్మి కి సంతోషం కలిగించే అంశాల్లో బైక్ రైడింగ్ ఒకటి.
కుంచె పట్టి.. అగ్ర హీరోలందరితో నటించి విజయాలు అందుకున్న భామ శ్రియ. ఈ సుందరి ఖాళీ దొరికితే కుంచె పట్టి కాన్వాస్ పై అద్భుత కళా ఖండాలను ఆవిష్కరిస్తుంది. వాటిని చూసి మురిసి పోవడమే కాకుండా.. ఆ చిత్రాలను వేలం వేసి.. వచ్చిన డబ్బులను సామాజిక సేవా సంస్థలకు విరాళంగా ఇస్తుంది.