స్టార్ హీరో ఫ్యాన్స్ అందరూ ఉగాది అప్డేట్స్ కోసం వెయిటింగ్
- March 11, 2020 / 01:45 PM ISTByFilmy Focus
ఉగాది పండుగ తెలుగు ప్రజలకు చాల ప్రత్యేకం. తెలుగు వారి నూతన సంవత్సరాది అయిన ఉగాదికి చాల మంది కొత్త కార్యక్రమాలు మొదలుపెడతారు . సినిమా వాళ్లు నూతన చిత్ర ప్రారంభోత్సవాలు జరపటం, అన్నౌన్మెంట్స్ , చిత్రీకరణ దశలో ఉన్న చిత్రాల టైటిల్స్, ఫస్ట్ లుక్స్, టీజర్ అండ్ ట్రైలర్స్ తో పాటు పాటలు వంటివి విడుదల చేస్తారు. అందుకే ఆయా హీరోల ఫ్యాన్స్ ఉగాది వేడుక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి 2020 ఉగాది కూడా దగ్గర పడింది. ఈనెల 25న ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. మరి ఈ ఉగాదికి ఏ హీరో ఎటువంటి గిఫ్ట్ తో ఫ్యాన్స్ ముందుకు వస్తారో అనేది ఆసక్తిగా మారింది.

ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ నుండి మూవీకి సంబందించిన టైటిల్ ప్రకటించే అవకాశంకలదు. లేదా 27న చరణ్ పుట్టినరోజు నేపథ్యంలో చరణ్ లుక్ విడుదల చేసినా ఆశర్యపోవాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఉగాదికి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. బాలయ్య-బోయపాటిల మూవీ ఇటీవలే మొదలైన నేపథ్యంలో చెప్పుకోదగ్గ అప్డేట్ ఏమి ఉండకపోవచ్చు. ఇక మహేష్ తన నూతన చిత్రానికి సంబంధించన ప్రకటన చేసే అవకాశం కలదు. ప్రభాస్ ఐతే రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ప్రకటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే నాగ్ అశ్విన్ మూవీకి సంబంధించి అప్డేట్ ఇవ్వొచ్చు. మరో స్టార్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ చిత్రానికి సంబందించిన అప్డేట్ ఇచ్చే అవకాశం కలదు. కాబట్టి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎవరు తమ ఫ్యాన్స్ కి అతిపెద్ద సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తారో చూడాలి.
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!
















