మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ‘క్రాక్’ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన 4 సినిమాల్లో.. ఘన విజయాన్ని సాధించిన చిత్రం ఇదే. 50 శాతం ఆక్యుపెన్సీతో కూడా రవితేజ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది ‘క్రాక్’. ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ కు.. వాటికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు.. మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మరోపక్క దీనికి సీక్వెల్ కూడా ఉండబోతుంది అని దర్శకుడు గోపి ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో తెలియజేసాడు. ఈ చిత్రానికి ముందు రవితేజ 4 ప్లాప్ లతో సతమతమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ‘క్రాక్’ సినిమాకి హీరోగా ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదట. మరో స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే.. ఇది రవితేజ వద్దకు వెళ్ళిందట. వివరాల్లోకి వెళితే.. ‘క్రాక్’ కథని ముందుగా నందమూరి బాలకృష్ణకు చెప్పాడట దర్శకుడు గోపీచంద్ మలినేని.బాలకృష్ణను దృష్టిలో పెట్టుకునే ఈ కథని డెవలప్ చేసుకున్నాడట.
అయితే కొన్ని కారణాల వలన బాలయ్య ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దాంతో గోపీచంద్ మలినేని రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగినట్టుగా కథ మార్చి అతనికి వినిపించాడట. అలా అది రవితేజ చెయ్యడం సూపర్ హిట్ అవ్వడం.. వీళ్ళ కాంబినేషన్లో హ్యాట్రిక్ కంప్లీట్ అవ్వడం జరిగింది.