మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ‘ధమాకా’. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటిరోజు నుంచే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా వీక్ డేస్ లో కాస్త డల్ అయింది కానీ ఇప్పటికే దాదాపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో రవితేజ పెర్ఫార్మన్స్, శ్రీలీల స్క్రీన్ ప్రెజన్స్ హైలైట్ గా నిలిచింది.
అయితే ముందుగా ఈ సినిమా కథను ఓ స్టార్ హీరోకి వినిపించారట. ఆయన నో చెప్పడంతో రవితేజకి వెళ్లిందని సమాచారం. ఇంతకీ ‘ధమాకా’ ఫస్ట్ ఛాయిస్ ఎవరంటే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ తో పాటు పలువురు స్టార్ హీరోలు సైతం ఈ ప్రాజెక్ట్ ను వదులుకున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత ‘ఆచార్య’ సినిమా చేశారు చరణ్.
ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ చరణ్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. అలానే బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు రామ్ చరణ్. ఇది కూడా పాన్ ఇండియా కథే అని సమాచారం. అలా రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథ రవితేజకి నచ్చడంతో ఆయన నటించడానికి ఒప్పుకున్నారు.
‘ధమాకా’లో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించారు. ఒకరు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా.. మరొకరు మిడిల్ క్లాస్ కి చెందిన వ్యక్తి. ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో దాదాపు రూ.32 కోట్ల వరకు రికవరీ అయినట్లు సమాచారం. మరో వారం రోజుల పాటు సరైన సినిమా రిలీజ్ కావడం లేదు కాబట్టి ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద సత్తా చూపడం ఖాయం.