ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమాలు సక్సెస్ అవుతాయా?

కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. పుష్ప ది రైజ్ సక్సెస్ తో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ పై దృష్టి పెడుతున్న దర్శకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని సమాచారం అందుతోంది. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న విరాటపర్వం సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.

విరాటపర్వం సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రానా, సాయిపల్లవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ షూటింగ్ కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే జరగనుందని తెలిసిందే. ఆగష్టులో పుష్ప ది రూల్ షూట్ మొదలుకానుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.

జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సింబా సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్, ఆర్‌ఆర్‌ఆర్, ఆచార్య సినిమాలు కూడా కొంతభాగం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకున్నాయి. రాబోయే రోజుల్లో విడుదల కానున్న ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమాలలో ఎన్ని సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus