ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఒక్కటవుతున్న టాలీవుడ్ స్టార్స్
- January 25, 2017 / 07:24 AM ISTByFilmy Focus
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని రాజకీయ పార్టీలకు అతీతంగా ఆంధ్ర యువత తమ గళాన్ని కేంద్రానికి వినిపించేందుకు సిద్ధమైంది. ప్రత్యేక హోదా సాధన కోసం జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్‌లో మౌన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ్ బచావో అంటూ పాటలను కూడా రిలీజ్ చేసి చైతన్యం కలిగించారు. ఈ పీస్ ర్యాలీ కి సినీ తారలు మద్దతు తెలుపుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు శాంతి ప్రదర్శనకు సపోర్ట్ చేస్తున్నట్లు వీడియో ద్వారా స్పష్టం చేశారు. హీరో రాజ్ తరుణ్, సంపూర్ణేష్ వంటి చిన్న హీరోల నుంచి బడా హీరోల వరకు వైజాక్ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు.
సినీ తారలు హైదరాబాద్ నుంచి వైజాక్ కి వెళ్ళడానికి కొన్ని కంపెనీలు స్పెషల్ బస్సులను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాయి. చైన్నై లో జల్లికట్టు ఉద్యమానికి కోలీవుడ్ పూర్తిగా మద్దతు తెలపడంతో ఆ స్పూర్తితో .. టాలీవుడ్ ప్రత్యేక హోదా కోసం ఒకటవుతోంది. జల్లికట్టుకి, ప్రత్యేక హోదాపై లింక్ ఏమిటి అని కొంతమంది రాజకీయ నాయకులు విమర్శిస్తే.. దానికి కొన్ని నిముషాల క్రితం పవన్ కళ్యాణ్ గట్టిగా సమాధానం చెప్పారు. “జల్లికట్టుకి ,హోదాకి లింకు ఏమిటి?అన్న ప్రశ్నకు-ఒక సాంప్రదాయం కోసం తమిళులు అంత పోరాటం చేస్తున్నప్పడు, మన అవసరాలు కోసం ఇంకెంత పోరాటం చెయ్యాలి” అటూ ట్వీట్ చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















