సినీ దర్శకులకు వర్షం పెద్ద వరం. వానలో ఏ సన్నివేశం తీసినా రెండింతల ప్రభావంతో కనిపిస్తుంది. సెంటిమెంట్ సీన్స్ కి వర్షం బలాన్నిస్తుంది. అదే హీరోయిన్ అందాలు చూడాలంటే రైన్ సాంగ్స్ కన్నా మంచి ఎఫెక్ట్ ఏమిలేదు. అలాగే హీరోయిజం కనిపించాలంటే వాన ఉండాల్సిందే. అలా రచ్చలేపిన టాప్ టెన్ రైన్ ఫైట్స్ పై ఫోకస్ ..
బాహుబలి తెలుగు చిత్రాల రికార్డులన్నింటిలో బాహుబలి ముందు స్థానంలో నిలిచింది. అంతేకాదు రైన్ ఫైట్ అంటే అందరి మదిలో గుర్తిండిపోయే విధంగా బాహుబలి ఇంట్రవెల్ రైన్ ఫైట్ ని రాజమౌళి తెరకెక్కించారు. ఇక్కడ వర్షంలో ప్రభాస్ యాక్షన్ పీక్స్ లోకి వెళుతుంది.
విక్రమార్కుడు మాస్ ప్రేక్షకులు విజల్స్ వేసేలా ఫైట్స్ చేయడంలో రవితేజ స్టైల్ వేరు. అటువంటి స్టైల్స్ కి మంచి సీన్ తో పాటు వర్షం తోడైతే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అటువంటి ఫైట్ విక్రమార్కుడులో ఉంది. రౌడీలందరినీ చితక్కొట్టి “ఇన్స్పెక్టర్ .. ఎవరైనా మిగిలారా” అని రవితేజ అడుగుతుంటే ప్రేక్షకుడి నోటి నుంచి “లేదు సార్” అని సమాధానం వస్తుంది. అంతలా ఆ ఫైట్ తో కనెక్ట్ అవుతారు.
ఎవడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ఎవడు చిత్రంలో అనేక ఫైట్లు ఉన్నాయి. అందులో వాన ఫైట్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. చెర్రీ యాక్షన్ కి వర్షం రియాక్షన్ తోడవ్వడంతోనే ఈ ఫైట్ హైలెట్ గా నిలిచింది.
జల్సా “సాంగ్స్ లోనే కాదు, ఫైట్ లోను రైన్ రొమాంటిక్ గా ఉంటుంది” అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పి .. జల్సా సినిమాలో హీరోయిన్స్ ని ఇబ్బందిపెట్టే ఆకతాయిలను కుమ్ముతుంటే పవన్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు.
మిర్చి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమాలో మొదట రైన్ ఫైట్ లేదు. ఒక వారం తర్వాత ప్రీ క్లైమాక్స్ వద్ద వర్షం ఫైట్ పెట్టారు. ఇందులో ప్రభాస్ మగాడు అంటే ఎలా ఉంటాడో స్ట్రాంగ్ పంచెస్ ద్వారా చూపించారు.
అశోక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రేమ కథలు చేసే వయసులోనే యాక్షన్ కథలతో మాస్ లో ఫాలోయింగ్ దక్కించుకున్నారు. అతన్ని స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి అశోక్ చిత్రంలో ఇంట్రడక్షన్ ఫైట్ లో ఎంతో స్టైల్ గా చూపించారు. వాన జోరున పడుతుండగా ఎన్టీఆర్ కొట్టే దెబ్బలు చూస్తుంటే రౌడీలపై పిడుగు పడుతున్నట్లు ఉంటుంది.
చెన్నకేశవరెడ్డి నందమూరి బాలకృష్ణ కి ఫైట్లు కొత్త కాదు. వర్షంలో ఎప్పుడో ప్రతాపం చూపించారు. అయితే చెన్నకేశవరెడ్డిలో బాలయ్య జైలు నాలుగు గోడల మధ్య వర్షంలో యోగ చేసి మరీ యదవలను బాదే బాదుడు ఊర మాస్ గా ఉంటుంది.
తులసిటైటిల్ సాఫ్ట్ గా ఉందని తులసి మూవీలో యాక్షన్ సీన్స్ ఉండవేమో అనుకున్న అభిమానులకు వెంకటేష్ తన ఫైట్స్ తో ఫుల్ మీల్స్ పెట్టారు. ఈ చిత్రంలో చిల్డ్రన్ పార్క్ లో వర్షం పడుతుండగా చేసే ఫైట్ సూపర్ గా ఉంటుంది.
అర్జున్ మహేష్ బాబు గన్స్ తో చేసే ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడూ గన్స్ తో మజా ఏముంటుందేమో అనుకున్నారేమో అర్జున్ సినిమాలో ప్రిన్స్ కత్తి పెట్టి వరుసపెట్టి రౌడీలను నరికారు. ఆ ఫైట్ కి వర్షం భారీతనాన్ని తీసుకొచ్చింది.
బుజ్జిగాడువర్షానికి ప్రభాస్ కి మంచి అనుబంధం ఉంది. ప్రేమ వ్యవహారమే కాదు, ఫైట్ వ్యవహారం నడిమినా వర్షం ప్రభాస్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. బుజ్జిగాడు సినిమాలో వానలో డార్లింగ్ నిప్పు, నీరు మధ్య ఫైట్ చేస్తుంటే అభిమానులకు శివుడిలా కనిపించారు.