Pooja Hege: బాలయ్య షోలో యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్..!

  • November 1, 2022 / 02:37 PM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2లో రచ్చ రంబోలా చేస్తున్నారు. హోస్ట్‌గా మరింత ఉత్సాహంతో షోని రక్తి కట్టిస్తున్నారు. సెలబ్రిటీలను తన స్టైల్లో ప్రశ్నలడుగుతూ.. వాళ్లతో ఆటలాడిస్తూ తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకాభిమానులకు చూపిస్తున్నారు. సెకండ్ సీజన్‌ని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌తో స్టార్ట్ చేశారు. రెండో ఎపిసోడ్‌లో విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో కలిసి మామూలుగా సందడి చెయ్యలేదు..మూడో ఎపిసోడ్‌కి కూడా మరో ఇద్దరు యంగ్ హీరోలను అదేనండీ..

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌ శర్వానంద్, అడివి శేష్‌లను తీసుకొచ్చారు బాలయ్య.. రీసెంట్‌గా ప్రోమో వదిలారు.. ఎప్పటిలానే ఎనర్జీతో కనిపించారు బాలయ్య.. తాను కుర్రాడినని.. మీకే ఇంకా పెళ్లి కాలేదంటూ ఆటపట్టించారు..శేష్, బాలయ్య కాళ్లకి నమస్కారం చెయ్యగా.. బాలయ్య.. ‘‘చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం.. అలా కాళ్ల మీద పడిపోకూడదు’’ అంటూ ఫన్నీగా చెప్పడంతో స్టార్ట్ ప్రోమో సింపుల్‌గా బాగుంది.. లాస్ట్ ఎపిసోడ్‌లో మీ క్రష్ గురించి చెప్పారు కదా.. అందుకే మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానంటూ..

రష్మిక మందన్నకి వీడియో కాల్‌ చేసి బాలయ్యకి సర్‌ప్రైజ్ ఇచ్చాడు శర్వానంద్..ర్యాపిడ్ ఫైర్‌తో ఇద్దర్నీ ఇరకాటంలో పడేశారు బాలయ్య.. ‘‘ఈమెతో మాత్రం కిస్ వద్దురా బాబు అనుకున్న హీరోయిన్ ఎవరు?’’ అని అడగ్గా.. అడివి శేష్.. వెంటనే ‘’పూజా హెగ్డే’’ అని చెప్పాడు. అప్పుడు శర్వా ఎక్స్‌ప్రెషన్ చూడాలసలు.. ఇక ‘‘సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టే హీరో?’’ అని అడగ్గా.. శర్వా, శేష్ ఇద్దరూ బాలయ్య వైపే చూశారు..

బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. ఎవరు యాక్టింగ్‌లో నంబర్ వన్ అని బాలయ్య ప్రశ్నిస్తే.. శేష్, శర్వా ఇద్దరూ మహాప్రభో అంటూ దణ్ణం పెట్టేశారు.. ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంటే.. ఇండస్ట్రీలో ప్రభాస్, శర్వానంద్ లాంటి పెళ్లికాని పెద్దలు చాలా మంది ఉన్నారని చెప్తున్నాను అని శేష్ అంటే.. నేను ప్రభాస్ పేరు చెప్పుకుని తిరుగుతున్నా.. నువ్వు నాపేరు చెప్పుకుని తిరుగుతున్నావ్ అంటూ నవ్వులు పూయించాడు శర్వా.. నవంబర్ 4న బాలయ్యతో శేష్, శర్వా సందడి చేసిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!


‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus