సంక్రాంతి పండగకి రిలీజైన ఈ వాల్తేరు వీరయ్య సినిమాకి మొదటి ఆటకి యావరేజ్ టాక్ వచ్చింది కానీ మొదటి రోజు, రెండో రోజు,,,మూడో రోజు నుండి సినిమాకి జనాదరణ పెరిగింది. కట్ చేస్తే వాల్తేరు వీరయ్య సినిమా మూడు రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దుమ్ము రేపింది. అక్కడితో ఆగకుండా మరో ఏడూ రోజులకి అంటే సరిగ్గా పది రోజులకి ఈ సినిమా 200 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది.
చిరుకి ఇది రెండో 200 వాడి కోట్ల సినిమా..ఇంతక ముందు మెగాస్టార్ నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమా బాక్సాఫీస్ దగ్గర 230 పై చిలుకు కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే చిరు రెండోసారి రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా…ఈ లిస్టులో ఉన్న మిగతా హీరోలు వాళ్ళ సినిమాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం…
1 బాహుబలి 2: వరల్డ్ వైడ్ గ్రాస్: 1810 కోట్లు

2 ఆర్ఆర్ఆర్: వరల్డ్ వైడ్ గ్రాస్: 1100+ కోట్లు

3 బాహుబలి 1: వరల్డ్ వైడ్ గ్రాస్: 605 కోట్లు

4 సాహో: వరల్డ్ వైడ్ గ్రాస్: 435 కోట్లు

5 పుష్ప: వరల్డ్ వైడ్ గ్రాస్: 360 కోట్లు

6 అల వైకుంఠపురములో: వరల్డ్ వైడ్ గ్రాస్: 257 కోట్లు

7 సైరా నరసింహారెడ్డి: వరల్డ్ వైడ్ గ్రాస్: 230+ కోట్లు

8 సరిలేరు నీకెవ్వరు: వరల్డ్ వైడ్ గ్రాస్: 224 కోట్లు

9 వాల్తేరు వీరయ్య: వరల్డ్ వైడ్ గ్రాస్: 220 కోట్లు

10 రంగస్థలం: వరల్డ్ వైడ్ గ్రాస్: 216 కోట్లు

11 సర్కారు వారి పాట: వరల్డ్ వైడ్ గ్రాస్: 200+ కోట్లు

