Allu Arjun, Shivarajkumar: ఆగష్టు 15న తగ్గేదేలే అంటున్న శివరాజ్ కుమార్.. ఏం జరిగిందంటే?

ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా పుష్ప ది రూల్ (Pushpa 2) రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అన్ని భాషల్లో రికార్డ్ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు పోటీగా పలు సినిమాలు రిలీజ్ అవుతాయని ప్రచారం జరిగినా వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమాలు పోటీ నుంచి తప్పుకున్నాయి.

అయితే బన్నీ (Allu Arjun) సినిమాకు పోటీగా శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. రిస్క్ అని తెలిసినా శివరాజ్ కుమార్ మాత్రం రిస్క్ తీసుకోవడానికే సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. శివరాజ్ కుమార్ మఫ్టీ మూవీకి కొనసాగింపుగా భైరతి రణగల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నర్తన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. కంటెంట్ పై కాన్ఫిడెన్స్ తో శివరాజ్ కుమార్ రిస్క్ చేస్తున్నారని తెలుస్తోంది.

సలార్ (Salaar) సినిమా రిలీజ్ సమయంలో కొన్ని సినిమాలు ఆ సినిమాకు పోటీగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేశాయనే సంగతి తెలిసిందే. ఆ కాన్ఫిడెన్స్ తోనే శివరాజ్ కుమార్ ధైర్యంగా ముందడుగులు వేస్తున్నారు. శివరాజ్ కుమార్ సినిమాలు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలుగా విడుదలవుతున్నాయి. శివన్న నిర్ణయం రైటో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

శివరాజ్ కుమార్ ఎంట్రీతో ఇండిపెండెన్స్ డే పోటీ రసవత్తరంగా మారిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప ది రూల్ కూడా ఈ సినిమా రిలీజ్ వల్ల కన్నడ నాట కొంతమేర కలెక్షన్లను నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. జూన్ నెల నుంచి ప్రతి నెలా ఒక భారీ సినిమాతో టాలీవుడ్ సినీ ప్రియులకు పండగ వాతావరణం మొదలుకానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus