తారక్ (Jr NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఓ సినిమా చేస్తున్నారు అనే విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల మూడో వారంలో సినిమా షూటింగ్ కర్ణాటకలో మొదలవుతుంది అని చెబుతున్నారు. ఈ మేరకు అక్కడ భారీ సెట్లు రూపొందిస్తున్నారు అని కూడా వార్తలొస్తున్నాయి. అయితే ఇవన్నీ పాత వార్తలే.. కొత్త వార్త ఏంటంటే ఈ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ మూడు పవర్ హౌస్‌లను కలుపుతున్నారట. అవును, మీరు చదివింది నిజమే.
Jr NTR , Prashanth Neel
ఈ పాన్ ఇండియా సినిమా కోసం ప్రశాంత్ నీల్ కాస్టింగ్ పనులను వేగవంతం చేశారట. ఈ క్రమంలో మలయాళ పరిశ్రమ నుండి ఇద్దరు స్టార్ నటులను సినిమాలోకి తీసుకున్నట్లు సమాచారం. వాళ్లే బీజూ మీనన్ (Biju Menon), టొవినో థామస్ (Tovino Thomas). మలయాళ పరిశ్రమలో తోపు నటులుగా వీరికి పేరు. అలాంటి నటుల్ని తీసుకుని సినిమాలో ముగ్గురు పవర్ హౌస్‌లను కలుపుతున్నారు ప్రశాంత్ నీల్ అని తారక్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ‘డ్రాగన్’ అనే పేరు తొలినాళ్లలో వినిపించింది. అయితే పాన్ ఇండియా లెవల్‌లో సినిమా వస్తుండటంతో ఇతర ఇండస్ట్రీల్లో ఆ పేరు అందుబాటులో లేదు. దీంతో పేరు మార్చే ఆలోచనలో ఉందట సినిమా టీమ్. ఇక ఈ సినిమా కోసం ఎప్పటిలాగే ప్రశాంత్ నీల్ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉన్నారట. రెండు పార్టులుగా రూపొందుతుంది అని చెబుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్.
2026 సంక్రాంతికి ఈ సినిమా తొలి పార్టును విడుదల చేయాలనేది మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్లాన్. అయితే షూటింగ్ అప్‌డేట్స్ బట్టి ఆ డేట్ ఉంటుంది అని చెప్పాలి. ఇక మూడో వారంలో తొలి షెడ్యూల్‌ను రిషభ్ శెట్టి (Rishab Shetty) సొంత ప్రాంతం కుందాపుర్ దగ్గర తెరకెక్కిస్తారని టాక్ నడుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ టీమ్ నుండి రావాల్సి ఉంది.