ఇటీవల ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమాలో ఉదయభాను కీలక పాత్ర పోషించింది. సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ జనాలు థియేటర్ కి రాలేదు. అందువల్ల ఓపెనింగ్స్ కూడా లేవు. దీంతో దర్శకుడు బాగా హర్ట్ అయ్యాడు. ఓ వీడియో రిలీజ్ చేసి అందులో చెప్పుతో కొట్టుకుని తన బాధను వ్యక్తం చేశాడు.
ఆ వీడియో ద్వారా దర్శకుడు మాట్లాడుతూ.. ” ‘హలో అండి నేను ‘బార్బరిక్’ సినిమాకి వెళ్లాను. థియేటర్లలో 10 మందే ఉన్నారు. ఆ 10 మంది దగ్గరకు వెళ్లి నేను అడిగాను. ‘సినిమా ఎలా ఉంది?’అని..! వాళ్లకు నేను డైరెక్టర్ అని చెప్పలేదు. ‘సినిమా చాలా బాగుంది.. చాలా బాగుంది’ అన్నారు. అందుకు నేను.. నిజం చెప్పండి భయ్యా..! నేను డైరెక్టర్ ని.. అని అన్నారు. ‘సార్ మీరు డైరెక్టరా?’ అని నన్ను హగ్ చేసుకుని ‘సినిమా చాలా బాగుంది సార్’ అని అంటే నాకు కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. మరి ఎందుకు మరి థియేటర్లలో 10 మందే ఉన్నారు. నాకు అర్థం కావడం లేదు. ఏం చేస్తే వస్తారు? నేను రెండున్నరేళ్లు పిచ్చి కుక్కలా కష్టపడ్డాను. నేను నిన్న ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ.. మా ఆవిడకి ఫోన్ చేశాను. నేను ఇంటికి వెళ్తున్నాను అని..! ఆమె 4:30 గంటల షోకి వెళ్ళింది. అయితే ఆమె పరిగెత్తుకుని ఇంటికి 5 గంటలకు వచ్చేసింది. ‘నేను ఎక్కడ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటానో అని భావించి ఆమె సినిమా చూడకుండా ఇంటికి వచ్చేసింది. రెండున్నరేళ్ల కష్టం. ఆమెకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు థియేటర్లలో చూస్తారు అని చెప్పి చేశాను భయ్యా. నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట అన్నాను జనాలతో. ‘సినిమా కనుక నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటా అని చెప్పాను’. అయినా జనం రావడం లేదు. నేనొక పనిచేస్తా.. మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళిపోయి అక్కడ సినిమాలు చేస్తాను. అప్పుడు తెలుగోడిగా నన్ను గౌరవిస్తారు. మీరు మలయాళ సినిమాలు అయితేనే చూస్తున్నారు. నేనైతే అన్న మాట ప్రకారం ‘నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా” అంటూ చెప్పుతో కొట్టుకుని తన ఆవేదన వ్యక్తం చేశాడు దర్శకుడు మోహన్ శ్రీవత్స.
ఎన్నాళ్లని ఆడియన్స్ ని బ్లేమ్ చేస్తారు..!
సింగిల్ స్క్రీన్స్ లో సినిమా రూ.100 దొరికినప్పుడే థియేటర్స్ బాగుంటాయి. సామాన్యులు థియేటర్స్ కి వస్తారు.
అప్పుడే ‘బార్బరిక్’ వంటి సినిమాలు బ్రతుకుతాయి. #Barbarik pic.twitter.com/zjrZoC8Jud
— Phani Kumar (@phanikumar2809) September 1, 2025