Tripti Dimri: ‘యానిమల్’ కి గాను తృప్తి దిమ్రి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?
- March 14, 2024 / 12:49 PM ISTByFilmy Focus
గతేడాది చివర్లో ‘యానిమల్’ (Animal) సినిమా రిలీజ్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్స్..తో చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.900 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రూ.25 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడం విశేషం.
ఇక ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది (Tripti Dimri) తృప్తి దిమ్రి. ఈ సినిమాలో ఆమె లుక్స్ కి తెలుగు యువత ఫిదా అయిపోయారు. అలాగే హీరో (Ranbir Kapoor) రణబీర్ కపూర్ తో కూడా బెడ్రూమ్ సీన్స్ లో చాలా బోల్డ్ గా నటించి షాకిచ్చింది. ‘ఎవరెవరో..’ అనే పాటలో ఈమె పలికించిన హావభావాలు గ్లామర్ ప్రియులను అమితంగా ఆకట్టుకున్నాయి. హీరోయిన్ రష్మిక (Rashmika Mandanna) కంటే కూడా ఈమె ఎక్కువ మార్కులు కొట్టేసింది అని చెప్పాలి.

‘యానిమల్’ ఎఫెక్ట్ వల్ల తెలుగు నుండి కూడా ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఈమె పారితోషికం కోట్లల్లో పలుకుతుంది. కానీ ‘యానిమల్’ సినిమాకి తృప్తి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా? కేవలం రూ.40 లక్షలు. అవును ఆ సినిమా టైంకి ఆమె కొత్త అమ్మాయి. కాబట్టి రూ.40 లక్షలకే ఆమె ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది.
ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు
భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?














