Trivikram: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ స్థాయిలో త్రివిక్రమ్ కు పేరు వస్తుందా?

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా ఈ కాంబినేషన్ లో తాజాగా మరో సినిమా ఫిక్స్ అయింది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా గతంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కాల్సిన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా తెరకెక్కించాలని భావించారు.

అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే మేకర్స్ క్లారిటీ ఇస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది బన్నీ త్రివిక్రమ్ మూవీ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది. మరోవైపు త్రివిక్రమ్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని భావిస్తున్నారు. అయితే రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ స్థాయిలో త్రివిక్రమ్ కు పేరు వస్తుందా? లేదా? అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.

త్రివిక్రమ్ (Trivikram) సైతం తన సినిమాలను నిదానంగా తెరకెక్కిస్తుండటం గమనార్హం. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. గుంటూరు కారం షెడ్యూల్స్ అనుకున్న విధంగా జరగకపోవడం ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోంది. త్రివిక్రమ్ సినిమాలు తెలుగునాట సత్తా చాటినా ఇతర భాషల్లో రీమేక్ కాగా అక్కడ ఆశించిన ఫలితాలను అందుకోలేదు.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో త్రివిక్రమ్ తన రేంజ్ ను పెంచుకునే అవకాశం ఉంటుందో లేదో స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. సినిమా సినిమాకు త్రివిక్రమ్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus