SSMB28: మహేష్ కథ మారిపోయిందట!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదివరకు వీరిద్దరూ కలిసి ‘అతడు’, ‘ఖలేజా’ వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. నిజానికి ఈపాటికే సినిమా షూటింగ్ సగం పూర్తి కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. ఒకానొక దశలో సినిమా ఆగిపోయిందని పుకార్లు వినిపించాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది.

సినిమా మొదటి షెడ్యూల్ ను మొదలుపెట్టి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలుకానుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కథ మొత్తాన్ని మార్చేశారట. మొదట త్రివిక్రమ్ చెప్పిన కథ మహేష్ బాబుకి పెద్దగా నచ్చలేదట. దీంతో మార్పులు చేస్తానని త్రివిక్రమ్.. మహేష్ కి చెప్పారట. దాని మీద చాలా రోజులు వర్క్ చేసినట్లు సమాచారం.

ముందుగా చెప్పిన స్క్రిప్ట్ కాకుండా.. పూర్తిగా మార్చిన స్క్రిప్ట్ ను మహేష్ ముందుకు తీసుకెళ్లారట. యూరప్ ట్రిప్ ముగించుకొని వచ్చిన వెంటనే మహేష్ బాబుకి స్క్రిప్ట్ వినిపించారట. మహేష్ బాబుకి నచ్చడంతో షూటింగ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మొదట యాక్షన్ డోస్ కాస్త ఎక్కువ మోతాదులో పెట్టినట్లు తెలుస్తోంది.

మార్పులు చేసిన తరువాత స్క్రిప్ట్ లో ఎమోషన్స్ కి, ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేశారట త్రివిక్రమ్. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అది మాత్రం హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus