‘ఖలేజా’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన సినిమాలను గమనిస్తే చాలా వరకు అతను సేఫ్ అయ్యే ప్రాజెక్టులే తీసుకుంటూ వచ్చాడు. ‘జులాయి’ నుండి ‘అల వైకుంఠపురములో’ వరకు అదే పద్ధతిని అనుసరించారు. మధ్యలో ‘అజ్ఞాతవాసి’ నిరాశపరిచినా.. మళ్ళీ ‘అరవింద సమేత’ తో తన సత్తా చాటుకున్నాడు. అయితే అవి స్క్రిప్ట్..ల పరంగా పెద్ద ఛాలెంజింగ్ ప్రాజెక్టులు కాదు. కానీ ‘గుంటూరు కారం’ విషయం వేరు. జనవరి 12 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
టాక్ సంగతి తెలిసిందే. ‘త్రివిక్రమ్ రాడ్డు సినిమా తీసాడు.. మరో అజ్ఞాతవాసి తీశాడు’ అంటూ విమర్శించని వారంటూ లేరు. కాకపోతే ‘అజ్ఞాతవాసి’ లో పవన్ కళ్యాణ్ నటనని భరించడం చాలా కష్టం అనే అభిప్రాయాలూ ఉన్నాయి. ‘గుంటూరు కారం’ విషయంలో మాత్రం మహేష్ బాబు నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇంకా చెప్పాలంటే రమణ అనే పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
‘ఖలేజా’ తర్వాత మహేష్ బాబుని ఇంత మాస్ గా చూడలేదు అని మహేష్ బాబు అభిమానులే అంటున్నారు. ఆ రకంగా త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారు. మదర్ సెంటిమెంట్ పై రాసుకున్న కథలో హీరోని మాస్ గా ప్రెజెంట్ చేయడం అనేది చిన్న టాస్క్ కాదు. రెండిటికీ సింక్ మిస్ అయిపోతుంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు బర్డెన్ గా ఫీలయ్యింది ఇదే. కానీ మహేష్ బాబు పాత్ర బాగా ఎంగేజ్ చేస్తుంది.
మహేష్ తో ఉన్న చనువు వల్లో ఏమో కానీ.. రమణ పాత్రని త్రివిక్రమ్ చాలా బాగా డిజైన్ చేశాడు. ప్రతి సీన్లోనూ మహేష్ బాబే హైలెట్ అయ్యాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ మహేష్ బాబు గురించి చెబుతూ.. ‘ ఒక సినిమాకి వంద శాతం చేయమని అడిగితే రెండు వందల శాతం ఎఫర్ట్ పెట్టి చేసే హీరో మహేష్ బాబు’ అని త్రివిక్రమ్ చెప్పారు. ఆ రకంగా (Trivikram) త్రివిక్రమ్ కూడా వంద శాతం సక్సెస్ అయ్యారు అని చెప్పాలి.