వెంకటేష్(Venkatesh ) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. త్రివిక్రమ్ రైటింగ్లో వెంకటేష్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) ‘మల్లీశ్వరి’ (Malliswari) సినిమాలకి కల్ట్ స్టేటస్ ఉంది. ఆ సినిమాల్లో వెంకటేష్ పండించిన కామెడీ, ఎమోషన్ ఇప్పటికీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత వెంకటేష్ తో ఓ సినిమా చేయాలని అభిమానులు కోరుకున్నారు. ఓ దశలో ఇది వర్కౌట్ అయినట్టే అయ్యి.. ఆగిపోయింది. కొన్నేళ్ల తర్వాత ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) టైంలో మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది.
కానీ సెట్స్ పైకి వెళ్ళింది అంటూ లేదు. ఈ కాంబినేషన్ గురించి త్రివిక్రమ్ – వెంకటేష్ ను ఎన్ని సార్లు అడిగినా వాళ్ళు సరిగ్గా స్పందించింది లేదు. అయితే ఇప్పుడు ఈ కాంబో గురించి మళ్ళీ మంచి వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు. కాకపోతే ఈ సినిమాలో మరో హీరో కూడా నటించాల్సి ఉంది. అందుకోసం చరణ్ ను (Ram Charan) అడుగుతున్నారు. త్రివిక్రమ్- వెంకటేష్..ల ప్రాజెక్టులో భాగం అవ్వడానికి చరణ్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ.
ఇద్దరూ కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) అత్యంత సన్నిహితులు కూడా..! కాకపోతే ప్రస్తుతం అతను ‘పెద్ది’ (Peddi) కోసం డెడికేటెడ్ గా పనిచేస్తున్నాడు. ఇలాంటి టైంలో త్రివిక్రమ్ సినిమా అంటే.. లుక్ విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే త్రివిక్రమ్ ఈ సినిమాని 2026 సంక్రాంతికి దింపాలని అనుకుంటున్నాడు. అది కష్టం. ఎందుకంటే పోటీగా చిరంజీవి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. తండ్రి సినిమాకి పోటీగా తన సినిమాని దింపాలని చరణ్ అనుకోడు కదా..!