Trivikram Remuneration: త్రివిక్రమ్ సంపాదన తెలిస్తే షాకవ్వాల్సిందే?

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇండస్ట్రీలో మాటల రచయితగా, దర్శకునిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించి విడుదలైన భీమ్లా నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎంతో ఉంది. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల విజయాలు దర్శకునిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రేంజ్ ను పెంచాయి. మహేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో త్వరలో ఒక సినిమా పట్టాలెక్కనుంది.

Click Here To Watch Now

పవన్ కళ్యాణ్ సినిమాల ఎంపికలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ మధ్య కాలంలో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించడం వల్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పది కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ రూపంలో దక్కిందనే సంగతి తెలిసిందే. అయితే పవన్ హీరోగా తెరకెక్కుతున్న మరో రీమేక్ సినిమా కోసం త్రివిక్రమ్ కు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండటం వల్ల రూ.20 కోట్లు రెమ్యునరేషన్ గా దక్కనుందని తెలుస్తోంది.

పవన్ వైష్ణవ్ తేజ్ కాంబో మూవీకి త్రివిక్రమ్ కథ, మాటలు సొంతంగా అందించనున్నారని ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ కు భారీగా రెమ్యునరేషన్ అందనుందని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ చేయకుండానే 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను అందుకుంటూ ఉండటం గమనార్హం. మహేష్ సినిమాకు డైరెక్టర్ గా త్రివిక్రమ్ రూ.50 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో సంపాదిస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ తర్వాత సినిమాలు కూడా విజయాలను అందుకుంటే మాత్రం ఈ డైరెక్టర్ రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమా కథ, టైటిల్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus