టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుని 80 శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు (Trivikram) పేరుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్లాప్ సినిమాలు సైతం బుల్లితెరపై అదరగొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన త్రివిక్రమ్ తర్వాత రోజుల్లో దర్శకునిగా మారి ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించారు. అయితే కెరీర్ తొలినాళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్ గా క్రెడిట్ తీసుకోవడానికి ఇష్టపడలేదట. డైరెక్టర్ కావాలని సినిమాల్లోకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా ముద్ర పడితే రైటర్ గానే కెరీర్ కొనసాగించాల్సి వస్తుందేమో అని టెన్షన్ పడ్డారట.
స్వయంవరం సినిమా కోసం పని చేసిన సమయంలో ఈ ఘటన జరిగిందట. త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు శ్రీనివాస్ కాగా ఈ సినిమాకు ఆయన త్రివిక్రమ్ అనే పేరుతో క్రెడిట్ తీసుకున్నారు. తర్వాత రోజుల్లో ఆయన పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గా మారుమ్రోగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత మూవీ బన్నీ (Allu Arjun) హీరోగా తెరకెక్కనుంది. పాన్ ఇండియా మూవీగా పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు బన్నీ త్రివిక్రమ్ కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కావడం గమనార్హం. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఎలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది.
బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 2026లో బన్నీ త్రివిక్రమ్ మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.