మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం త్రివిక్రమ్.. రాజమౌళి పద్దతిని ఫాలో అవుతున్నాడట. త్రివిక్రమ్ కు ఓ డిజాస్టర్ పడితే తన తరువాత సినిమా నుండీ కొత్త పద్ధతిని ఫాలో అవుతుంటాడు. గతంలో ‘ఖలేజా’ చిత్రాన్ని సంవత్సర తరబడి తీసి డిజాస్టర్ ను చేసాడని తన తరువాత సినిమాల నుండే వేగం పెంచాడు. ఒక్కో సినిమాని 6 నెలల్లో నెలల్లో తీసేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక గతేడాది ‘అజ్ఞాతవాసి’ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో తన పద్దతిని మార్చుకుని ‘అరవింద సమేత’ చిత్రంతో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఈ చిత్రంకోసం పద్ధతి మర్చి ముందే చాలా సిటింగ్లు వేసి అనిరుద్ ను తప్పించి తమన్ సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. అలా చాలా మార్పులు చేసి హిట్టుకొట్టాడు.
ఇలాంటి ఫార్ములా ఎక్కువగా రాజమౌళి ఫాలో అవుతుంటాడు. ముందుగా కొన్ని వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు.ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. రాజమౌళి వర్క్ షాప్స్ కి అటెండ్ అవ్వాల్సిందే. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా తన సినిమాల విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాడట. మూడు, నాలుగు రోజుల షాట్ లు అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని.. ఒకరోజు వర్క్ షాప్ ఏర్పాటు చేసి రిహార్సల్స్ చేయించి…రిహార్సల్స్ అయిన మరుసటి రోజు నుండీ మూడు, నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. మళ్ళీ రిహార్సల్స్ చేయించి.. షూటింగ్ కి వెళ్ళి ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుందన్నమాట. అల్లు అర్జున్ కూడా ఈ రిహార్సల్స్ కి హాజరవుతున్నాడు. ఈ విధంగా చేయడం వల్ల మంచి అవుట్ పుట్ రావడంతో పాటు సమయం కూడా కలిసొస్తుందని త్రివిక్రమ్ గట్టిగా నమ్ముతున్నాడట.