Varasudu: ఓటీటీకి వచ్చి ట్రోలర్స్‌కు పని చెప్పిన వారసుడు.. ఏమైందంటే?

వసూళ్ల పోస్టర్‌లు విడుదల చేసి ఫ్యాన్స్‌ను ఆనందపరచొచ్చు.. కానీ విషయం తెలిసి ట్రోలింగ్‌కి దిగిన ట్రోలర్స్‌ను కూల్‌ చేయలేవ్‌! ఏంటీ ఏదో సినిమా డైలాగ్‌ కాపీలా ఉంది అనుకుంటున్నారా? ఇంచుమించు అంతే. కాసేపు మీరు కాపీ విషయం పక్కనపెట్టి డైలాగ్‌లో ఎమోషన్‌ చూడండి విషయం మీకే అర్థమవుతుంది. రీసెంట్‌ టైమ్‌లో ట్రోలింగ్‌ అంటే ‘వరిసు’. ‘వారసుడు’ అంటే ట్రోలింగ్‌ అనేలా మారిపోయింది పరిస్థితి. దానికి కారణం సినిమా లెక్కలకు, నిర్మాతలు చెబుతున్న లెక్కలకు ఎక్కడా సంబంధం లేకుండా ఉండటమే అంటున్నారు.

మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో బంపర్‌ హిట్‌ అయిన సినిమా ఏంటి అంటే.. తెలుగులో రెండు పేర్లు చెబుతారు. తమిళంలో ఓ సినిమా పేరు చెబుతారు. కానీ ‘వరిసు’ / ‘వారసుడు’ టీమ్‌ మాత్రం తెలుగులో మూడు పేర్లు చెబుతారు, తమిళంలో రెండు పేర్లు చెబుతారు. వీలైతే ఒకటే చెబుతారు కానీ అది వాళ్లదే అంటారు. అంతలా వసూళ్ల వార్‌ జరిగింది సంక్రాంతికి. అయితే అక్కడి లెక్కేమో కానీ.. ఇప్పుడు ఓటీటీలో అసలు రంగు బయటపడింది అంటున్నారు.

మొన్నీమధ్య ఓటీటీలోకి వచ్చిన ‘వరిసు’ / ‘వారసుడు’కి స్పందన నిరాశజనకంగా ఉందట. టీవీ సీరియల్‌లా ఉందని తమిళ క్రిటిక్స్ ‘వరిసు’ మీద విరుచుకుపడిన విషయం తెలిసిందే. తెలుగులో ‘వారసుడు’క ఓ మాదిరి వసూళ్లు సాధించింది అని అంటున్నారు. అయితే బ్లాక్ బస్టర్ రేంజ్‌లో ఆడలేదు. కానీ నిర్మాతలు మాత్రం రూ. 300 కోట్ల పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. దీంతో ఓటీటీలో చూసి అసలు సంగతి ఏంటో తెలుస్తుందిలే అని అనుకున్నారంతా.

అనుకున్నట్లుగానే సినిమాకు ఓటీటీలో సరైన స్పందన లేదు అంటున్నారు. ప్రచారం వల్ల జనాలు వచ్చారు కానీ.. సినిమాకు మాత్రం బ్యాడ్‌ టాకే వచ్చింది అంటున్నారు. అయితే ‘వరిసు’ చేసిన వంశీ పైడిపల్లికి విజయ్‌ మరో ఛాన్స్‌ ఇచ్చారనే టాక్‌ కూడా నడుస్తోంది. అది నిజమైతే లోకేశ్‌ కనగరాజ్‌తో చేస్తున్న ‘లియో’ పూర్తవ్వగానే వంశీ పైడిపల్లి సినిమా ఉండొచ్చు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus