Naatu Naatu Song: నాటు నాటు పాటపై ట్రోల్స్.. పూజా భట్ ఏమన్నారంటే?

  • January 13, 2023 / 02:58 PM IST

ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం నందమూరి అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. జక్కన్న కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని తారక్, చరణ్ ఆ పాట కోసం ఏ స్థాయిలో కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడంపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఆ పాటేంటి ఆ యాసేంటి అంటూ కామెంట్లు రావడంతో నటి పూజా భట్ ఆ కామెంట్లపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

“ఒకరి బాధను చూడగలం కానీ వారి సంతోషాన్ని చూసి తట్టుకోలేకపోవడం మానవ నైజం కదా” అంటూ పూజా భట్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు వచ్చిన గుర్తింపును చూసి తట్టుకోలేక కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో విదేశీ ప్రేక్షకులకు సైతం తెలుగు సినిమాల గొప్పదనం అర్థమైంది. చరణ్, తారక్ సినిమాలకు ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఆర్.ఆర్.ఆర్ మూవీకి సీక్వెల్ దిశగా కూడా జక్కన్న అడుగులు పడుతున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కితే బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జక్కన్న తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాలి. రాజమౌళి సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఎక్కువగా ఉంటాయి.

ఆ సీన్లు సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ సినిమాతో జక్కన్న పాన్ వరల్డ్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus