Vaarasudu Movie: వారసుడు మూవీ లుక్ పై ట్రోల్స్.. కానీ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన వంశీ పైడిపల్లి నిదానంగా సినిమాలను తెరకెక్కిస్తున్నా ఆ సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి విజయాల తర్వాత విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వారసుడు పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగ్ హిట్ మూవీ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది.

అయితే మహర్షి సినిమాలో మహేష్ ను వంశీ పైడిపల్లి ఏ విధంగా చూపించారో వారసుడు సినిమాలో విజయ్ ను అదే విధంగా చూపిస్తున్నారని నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. మహర్షి లుక్ కు వారసుడు లుక్ కాపీ అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. వంశీ పైడిపల్లి ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. తమిళంలో వారిసు పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావడంతో చరణ్ శంకర్ కాంబో మూవీ సంక్రాంతికి రిలీజ్ కానట్టేనని ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది. విజయ్ నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నా బాక్సాఫీస్ వద్ద భారీస్థాయిలో కలెక్షన్లను రాబట్టడంలో ఈ సినిమాలు ఫెయిలవుతుండటం గమనార్హం. విజయ్ గత సినిమా బీస్ట్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాకు పోటీగా రిలీజ్ చేయడం కూడా బీస్ట్ సినిమాకు మైనస్ అయింది. రొటీన్ కథ, కథనంతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలవుతున్నాయి. వంశీ పైడిపల్లికి తెలుగులో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న నేపథ్యంలో విజయ్ సినిమాతో ఈ దర్శకుడు బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus