సీరియల్స్, సినిమాలు, ఐపీఎల్ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రియాలిటీ షోలు ప్రయత్నిస్తున్నాయి. ఏకంగా తెలుగు తెరపై టాప్ స్టార్లను రంగంలోకి దించి టీవీ ఛానెల్స్ నిర్వహిస్తున్న షోలకు జనం నుంచి ఆదరణ లభించడం లేదని టీఆర్‌పీ రేటింగ్‌లు చెబుతున్నాయి. ప్రస్తుతం మా టీవీలో నాగార్జున హోస్ట్‌గా వస్తున్న బిగ్‌బాస్, జెమినీ టీవీలో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు… అలాగే తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ స్టార్ సెలబ్రెటీలు వున్నప్పటికీ ఈ మూడు షోలు జనాన్ని ఆకట్టుకోలేకపోతున్నాయట.సీరియల్స్, రియాలిటీ షోలను ప్రాతిపదికగా తీసుకుని వచ్చిన టీఆర్‌పీ రేటింగ్స్‌ను పరిశీలిస్తే.. స్టార్ మా ఛానెల్ 39వ వారంలో అత్యధికంగా అర్బన్ ప్రాంతంలో 921, రూరల్ ప్రాంతంలో 979 రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. జీ తెలుగు.. అర్బన్ ప్రాంతంలో 547 పాయింట్లతో, అలాగే రూరల్‌లో 749 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో.. ఈటీవీ తెలుగు 438 (అర్బన్), 481 (రూరల్) రేటింగు పాయింట్లతో మూడో స్థానంలో, జెమినీ టీవీ 320 (అర్బన్), 405 (రూరల్) రేటింగుతో నాలుగో స్థానంలో నిలిచాయి.
ఇక మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ విషయానికి వస్తే.. దీని రేటింగ్ ప్రతీ వారం క్షీణిస్తూనే వస్తోంది. ఈ షో అర్బన్ ఏరియాల్లో 38వ వారంలో 5.76 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 5.48 రేటింగ్ మాత్రమే నమోదు చేసింది. ఇక రూరల్ ప్రాంతంలో 38వ వారంలో 3.27 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 3.20 రేటింగ్ పొందింది. వీకెండ్స్‌లో నాగార్జున వస్తున్నప్పటికీ బిగ్‌బాస్ టీఆర్‌పీని లేపలేకపోతున్నాడు. 38వ వారంలో అర్బన్ ఏరియాలలో 9.84 రేటింగ్ సొంతం చేసుకోగా, 39వ వారంలో 5.48 రేటింగ్‌ను సాధించింది. ఇక రూరల్ విషయానికి వస్తే..
38వ వారంలో 3.27 రేటింగ్ నమోదు చేయగా.. 39వ వారంలో 3.27 రేటింగ్‌ను కైవసం చేసుకుంది.ఇక జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులను కూడా జనం పట్టించుకోవడం లేదు. రాంచరణ్, రాజమౌళి, కొరటాల శివ వంటి సెలబ్రిటీలు మధ్యలో సందడి చేసినప్పటికీ పూర్ పర్ఫార్మన్స్‌నే నమోదు చేసింది. 38వ వారంలో అర్బన్ ప్రాంతంలో ఈ షో 4.70 రేటింగ్‌ను సొంతం చేసుకొంటే.. 39వ వారంలో 4.00 రేటింగ్ మాత్రమే సాధించింది. రూరల్ విషయానికి వస్తే..
38వ వారం 2.71 రేటింగ్‌తో వస్తే. 39వ వారానికి అది దారుణంగా పడిపోయి కేవలం 2.42 రేటింగ్ పొందింది.అటు జీ తెలుగులో శుక్ర, శనివారాల్లో ప్రసారమవుతున్న మాస్టర్ చెఫ్ విషయానికి వస్తే.. తమన్నా భాటియా.. నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్‌ల కంటే వెనుకబడ్డారు. ఈ షోకు 39వ వారంలో అర్బన్ ప్రాంతంలో 1.81 రేటింగ్, అలాగే రూరల్‌లో 1.38 రేటింగ్ వచ్చింది. 38వ వారంలో అర్బన్‌లో 2.23, రూరల్‌లో 1.49 రేటింగ్‌ను సొంతం చేసుకోవడం తెలిసిందే.