నటి తులసి డిసెంబర్ 31తో తన యాక్టింగ్ కెరీర్ ను ముగిస్తున్నట్టు ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఆశ్చర్యం నెలకొంది. 1967లో భార్య సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, శంకరాభరణం’లో బాలనటిగా మంచి గుర్తింపు పొందారు. తన సహజ నటనతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, భోజ్‌పురి భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి అరుదైన కెరీర్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. ఇలా కొనసాగుతున్న తులసి కెరీర్ నుంచి ఇంత తొందరగా తన రిటైర్మెంట్ ప్రకటించబడుతుందని ఎవరూ ఊహించలేదు.
Tulasi
ఇటీవల ఆమె చాలా తక్కువగా పాత్రల్లో మాత్రమే కనిపించినప్పటికీ, F3లో వెంకటేశ్‌కు సవతి తల్లి పాత్రతో పాటు, ప్రభాస్ సూపర్ హిట్ చిత్రాల్లోనూ ఆమె గుర్తుండిపోయే పాత్రలు చేశారు. మహేష్ బాబు తో శ్రీమంతుడు లాంటి బిగ్గెస్ట్ హిట్ లోను ఆమె నటించారు.తులసి కి ఇప్పటితరంలో అభిమాన హీరో మాత్రం జూనియర్ ఎన్ఠీఆర్ అని ఆమె చాలా ఇంటర్వ్యూ లలో తెలిపారు. పెద్దగా ప్రచారం లేని పాత్రలే అయినా, తెరపై ఆమె కనిపిస్తే ప్రేక్షకులకు ఓ ఆప్యాయత కలిగేది.
గత కొంతకాలంగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గడం, రిటైర్మెంట్ నిర్ణయానికి ముందస్తు సంకేతమే అని అంటున్నారు సినీ వర్గాలు. సాయిబాబాపై అమితమైన భక్తి ఉన్న తులసి, అదే భక్తితో తన రిటైర్మెంట్ తేదీని కూడా షిరిడి దర్శనంతో ముడిపెట్టుకున్నారు. “సాయి నాథుడి కృపతో శాంతియుతంగా నా ప్రయాణం కొనసాగాలి” అంటూ ఆమె తన పోస్టులో ప్రకటించారు.