‘‘అన్‌స్టాపబుల్’’ అనే పేరుకి తగ్గట్టే షోని ఆద్యంతం తనదైన శైలిలో రక్తి కట్టిస్తూ.. సెలబ్రిటీల్లోని ప్రేక్షకులకు తెలియని కొత్త కోణాలను చూపిస్తూ, కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తెస్తూ.. వాటిని సరికొత్తగా తెలుగు ప్రేక్షకులకు తెలియజేస్తూ.. ‘‘అన్‌స్టాపబుల్’’ షోని నంబర్ వన్ టాక్ షోగా నిలిబెట్టారు నందమూరి నటసింహం బాలయ్య బాబు.. ఇటీవలే సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది.. బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్ లాంటి రిలేటివ్స్ కమ్ పొలిటిషియన్లతో స్టార్ట్ చేసి,
సెకండ్ ఎపిసోడ్‌లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలతో రచ్చ రంబోలా చేశారు. థర్డ్ ఎపిసోడ్‌కి శర్వానంద్, అడివి శేష్ వచ్చారు.. ర్యాపిడ్ ఫైర్ నుండి రకరకాలుగా వాళ్లతో ఆడుకుని తను కూడా ఎంజాయ్ చేస్తూ అందర్నీ అలరించిన బాలయ్య.. ఫోర్త్ ఎపిసోడ్‌కి.. నిజాం కాలేజీలో తన క్లాస్‌మెట్ కమ్ ఫ్రెండ్ అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొస్తున్నారని అన్నారు..
కట్ చేస్తే.. నాలుగో ఎపిసోడ్‌లోనూ ఒకరు కాదు.. ఇద్దరు లెజెండరీ పర్సనాలిటీస్‌ని తీసుకొచ్చారు.. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు.. తన వాక్ చాతుర్యంతో అసెంబ్లీ సమావేశాల్ని రక్తి కట్టిస్తూ.. ‘‘ప్లీజ్, కూర్చోండి’’ అని సభ్యులందర్నీ రిక్వెస్ట్ చేస్తూ.. ‘‘ఫ్రెండ్లీ స్పీకర్’’ గా పేరొందిన కె.ఆర్. సురేష్ రెడ్డి కూడా పాల్గొంటున్నారని కన్ఫామ్ చేస్తూ.. ఆహా టీమ్ అఫీషియల్‌గా పిక్స్ రిలీజ్ చేశారు.. ‘‘ఫ్రెండ్స్ కలిసినప్పుడు కన్వర్జేషన్‌కి అంతే ఉండదు.. ఈ ముగ్గురి ముచ్చట్లు, మెమరీస్ ఎపిసోడ్ 4లో’’ అంటూ అంచనాలు పెంచేశారు..
ఫోటోల్లో ఎప్పటిలానే యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు బాలయ్య బాబు.. ఆయనతో పాటు గెస్టులిద్దరూ కూడా సరదాగా షోని బాగానే ఎంజాయ్ చేసుంటారని పిక్స్ చూస్తేనే తెలుస్తోంది.. జనరల్‌గా ప్రోమో, టీజర్ లాంటివి చూస్తే హైప్ క్రియేట్ అవుతుంది కానీ, ఇక్కడుంది ఎవరు?.. బాలయ్య.. కాబట్టి, సింహానికి సింగిల్ పిక్ చాలు అన్నట్టు ఫోటోలను బాగా వైరల్ చేస్తేన్నారు నందమూరి ఫ్యాన్స్.. అన్‌స్టాపబుల్ ఫోర్త్ ఎపిసోడ్ ప్రోమో కోసం ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..