Prabhas: అభిమానులకు శుభవార్తలు చెప్పనున్న ప్రభాస్!

స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. తాజాగా ప్రభాస్ 25వ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ప్రభాస్ రెండేళ్లలో ఏకంగా ఐదు సినిమాలను విడుదల చేసే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రెండు కీలకమైన అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా క్రేజ్ దక్కింది.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీల దర్శకులు సైతం ప్రభాస్ తో సినిమాను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాధేశ్యామ్ మూవీ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కగా ఈ సినిమాలో లవ్ సీన్లు కూడా ఉంటాయని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. రాధేశ్యామ్ సినిమా టీజర్ అప్డేట్ ఈ నెల 13వ తేదీన వస్తుందని తెలుస్తోంది.

రాధేశ్యామ్ సినిమా టీజర్ మాత్రం ఈ నెల 23వ తేదీన రిలీజ్ కానుందని సమాచారం. ప్రభాస్ అభిమానులకు రెండు సర్ప్రైజ్ లు ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ టీజర్లు ప్రభాస్ అభిమానులకు నచ్చే విధంగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కనుండగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా ప్రభాస్ ఈ సినిమాలో కార్ల కంపెనీ ఓనర్ గా కనిపిస్తారని తెలుస్తోంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus