మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వయస్సు పెరుగుతున్నా కెరీర్ కోసం ఎంతో కష్టపడుతూ కెరీర్ పరంగా సక్సెస్ సాధించడానికి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. విశ్వంభర (Vishwambhara) సినిమాతో చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారని అభిమానులు ఫీలవుతున్నారు. తాజాగా చిరంజీవికి అరుదైన గౌరవం లభించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. దుబాయ్ ప్రభుత్వం చిరంజీవికి గోల్డెన్ వీసా అందించింది. 2019 సంవత్సరం నుంచి యూఏఈ గోల్డెన్ వీసాలు అందిస్తుండగా ఈ వీసా ద్వారా దుబాయ్ లో ఎలాంటి పరిమితులు లేకుండా నివాసం ఉండవచ్చు.
కొన్నిరోజుల క్రితం యూఏఈ రజనీకాంత్ కు (Rajinikanth) గోల్డెన్ వీసా అందించిన సంగతి తెలిసిందే. చిరంజీవికి గోల్డెన్ వీసా దక్కడంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం కెరీర్ పరంగా కూడా ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే ఈ వార్తలను అయితే నమ్మాల్సి ఉంటుంది.
చిరంజీవి 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. చిరంజీవి కుటుంబంలో ఇప్పటికే ఉపాసన, బన్నీలకు గోల్డెన్ వీసా ఉండగా చిరంజీవి కూడా ఆ జాబితాలో చేరడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు పోయాయి.
చిరంజీవి గోల్డెన్ వీసా పొందడంతో దుబాయ్ లో పది సంవత్సరాల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన నివాసం ఉండటానికి అనుమతులు లభించాయి. చిరంజీవికి మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సీనియర్ హీరోలలో చిరంజీవి నంబర్ వన్ స్థానంలో ఉన్నారనే సంగతి తెలిసిందే. చిరంజీవి రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.