ఎంఈకేలో సందడి చేయనున్న వెంకీ
- March 27, 2017 / 01:33 PM ISTByFilmy Focus
విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమా ఈనెల 31 రిలీజ్ కానుంది. అంతకంటే ముందు వెంకీ బుల్లితెరలో సందడి చెయ్యనున్నారు. మాటీవీలో ప్రసారమవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోకి గెస్ట్ గా రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో ఇప్పటివరకు నాగార్జున , రానా, సాయి ధరమ్ తేజ్, సునీల్ పాల్గొని టీవీ ప్రేక్షకులను అలరించారు. మహిళా దినోత్సవం నాడు రాధిక, సుహాసిని వచ్చి చిరుతో సరదాగా కబుర్లు చెప్పి నవ్వులు పంచారు.
ఈ ఉగాదికి వెంకీ, చిరు కలిసి ఎంటైర్ టైన్ చేయనున్నారు. ఈ సంగతిని తెలియజేస్తూ మా టీవీ వారు విడుదల చేసిన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 29 న రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానున్న ఫుల్ ఎపిసోడ్ కచ్చితంగా పండుగ అనుమదాన్ని డబుల్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















