Akhanda OTT Release: ఓటీటీలో అఖండ రిలీజ్ డేట్ మారిందా?

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ అంచనాలను మించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య కెరీర్ లో అఖండ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. అఖండ సినిమాలోని అఘోర పాత్రకు బాలయ్య పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అఖండ విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి.

అయితే ప్రస్తుతం అఖండ సినిమాను పరిమితంగా థియేటర్లలో ప్రదర్శిస్తున్నా వీకెండ్ లో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. అందువల్ల అఖండ మేకర్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ను వాయిదా వేయించినట్టు సమాచారం. సంక్రాంతి నుంచి అఖండ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని బోగట్టా. అయితే ఆలస్యంగా సినిమాను స్ట్రీమింగ్ చేయడం వల్ల హాట్ స్టార్ కు కొంత మొత్తం నష్టం తప్పదు. ఈ నష్టాన్ని అఖండ నిర్మాతలు భరిస్తారా? లేక హాట్ స్టార్ భరిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.

హాట్ స్టార్ బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని భారీ మొత్తం ఖర్చు చేసి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. ఆలస్యంగా అఖండ సినిమాను స్ట్రీమింగ్ చేస్తే ఆశించిన స్థాయిలో వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. సంక్రాంతి వరకు అఖండ థియేటర్లలో ప్రదర్శితం అవుతుందని తెలిసి బాలయ్య అభిమానులు సంతోషిస్తున్నారు. ఫుల్ రన్ లో అఖండ 70 కోట్ల రూపాయల మార్కును చేరుకునే ఛాన్స్ ఉంది.

తెలంగాణలో ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. బాలయ్య కెరీర్ లో తెలంగాణలో 20 కోట్ల రూపాయల మార్కును అందుకున్న తొలి సినిమాగా అఖండ నిలవడం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ తో దర్శకుడు బోయపాటి శ్రీనుకు సైతం ఆఫర్లు పెరిగాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus