Priya Banerjee: ‘రానా నాయుడు’ లో నటించిన ప్రియా బెనర్జీ గురించి ఆసక్తికర విషయాలు..!

గత కొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ గురించే రకరకాల వార్తలు.. విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించడంతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారిలోనూ అంచనాలు పెరిగిపోయాయి.. కట్ చేస్తే.. స్ట్రీమింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి కాంట్రవర్సీలు వస్తూనే ఉన్నాయి.. వెంకీ ఇలాంటి సిరీస్‌లో నటిస్తాడని అస్సలు ఊహించలేదని.. ఫ్యామిలీతో కలిసి చూడ్డం దరిద్రం అంటూ నెటిజన్లతో సహా సెలబ్రిటీలు కూడా ఏకి పారేస్తున్నారు..

ఎవరేమన్నా.. ఎన్ని వివాదాలు వచ్చినా చూసే వాళ్లు మాత్రం చూస్తూనే ఉన్నారు.. పైగా.. ఇంత రచ్చ చేస్తున్నారంటే అసలు అందులో ఏముందో చూద్దాం అని చూస్తున్న వాళ్లు కూడా ఉండడం విశేషం.. ఏదైమైనా మెయిన్ కాస్టింగ్‌తో పాటు ఇతర ఆర్టిస్టులందరు కూడా బాగానే నోటెడ్ అయ్యారు జనాలకి.. ఇక ఇందులో బాలీవుడ్ హీరోయిన్ మందిర అనే క్యారెక్టర్లో నటించిన ప్రియా బెనర్జీ గురించి కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది..

తాను ఎన్నో పాత్రలు చేసినా కానీ ‘రానా నాయుడు’ లో మందిర క్యారెక్టర్ రియల్ హీరోయిన్స్ షేడ్స్ ఉండడం, తాను ఇండస్ట్రీలో చూసిన కొంతమందికి ఈ పాత్ర దగ్గరగా ఉండడం వల్ల తనకు బాగా ఇష్టమని.. రానాతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉందని.. క్యారెక్టర్ కోసం తన పొడవాటి జుట్టు కత్తిరించుకోవాల్సి వచ్చిందని.. ఇంతకుముందు తెలుగులో నటించినప్పుడు తనకు బాష సరిగా రాకపోయినా ఇక్కడి వారు బాగా ఆదరించారని చెప్పుకొచ్చింది..

కాగా, ప్రియా బెనర్జీ.. 2013లో అడివి శేష్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన ‘కిస్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. తర్వాత సందీప్ కిషన్ ‘జోరు’, నారా రోహిత్ ‘అసుర’ సినిమాలు చేసింది.. తమన్నా ‘లెవెన్త్ అవర్’ లోనూ కనిపించింది.. హిందీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసింది కానీ ‘రానా నాయుడు’ తోనే ఆమెకు సరైన గుర్తింపు వచ్చింది.. దీని ద్వారా త్వరలో మరిన్ని ఆఫర్స్ తలుపు తడతాయని నమ్మకంతో ఉంది ప్రియా..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus