వై.వి.ఎస్ చౌదరి.. అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు. ఫేడౌట్ అయిపోయిన హరికృష్ణ వంటి నటుడిని హీరోగా నిలబెట్టి మార్కెట్ ఏర్పడేలా చేసిన వ్యక్తి. ఈయన కొత్త హీరో , హీరోయిన్లను పరిచయం చేస్తే కచ్చితంగా వాళ్లకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తాడు అనే ఓ సెంటిమెంట్ ఉంది. స్రవంతి రవికిషోర్ వంటి బడా నిర్మాత ఇదే నమ్మారు. అందుకే రామ్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యతను వై.వి.ఎస్ చౌదరికి అప్పగించారు.
హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయి ఇలియానా ని టాలీవుడ్ కు తీసుకొచ్చారు. 3 నెలల్లో షూటింగ్ పూర్తయింది. వై.వి.ఎస్ చౌదరి నే నిర్మాత. 2006 వ సంవత్సరం జనవరి 11న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ సంక్రాంతి సీజన్ కు సోలో రిలీజ్ దక్కించుకున్న మూవీ ఇది. కానీ సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. ఒక్క సంక్రాంతి సీజన్ అనే కాదు 2 వారాల పాటు ఈ చిత్రం ఫ్లాప్ అని ప్రేక్షకులు బలంగా ఫిక్స్ అయిపోయారు.
కానీ విచిత్రంగా ఈ మూవీ 3వ వారం నుండీ పుంజుకుంది. థియేటర్స్ కూడా పెరిగాయి. సక్సెస్ ఫుల్ గా 34 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఫైనల్ గా 7 థియేటర్లలో 175 రోజులు ఆడింది. కథ పాతదే కానీ చక్రి సంగీతం బాగా ప్లస్ అయ్యింది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా మేజర్ ప్లస్ అయ్యింది. ఈ చిత్రం రిలీజ్ అయ్యి 17 ఏళ్ళు పూర్తికావస్తున్న నేపథ్యంలో దేవదాసు మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. అంతేకాకుండా రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి కూడా 17 ఏళ్ళు పూర్తయ్యింది అన్న మాట.