బర్త్ డే స్పెషల్ : ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి గురించి మనకి తెలియని విషయాలు..!

నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ మంచి వసూళ్ళను రాబడుతుంది. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ పెద్ద బ్యానర్ల లిస్ట్ లో ‘ద్వారకా క్రియేషన్స్’ కూడా చేరిందని చెప్పొచ్చు. ఈరోజు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి గారి పుట్టినరోజు. కాబట్టి ఆయనకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) మిర్యాల రవీందర్ ఓ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈయన సొంత ఊరు తెలంగాణలోని సూర్యాపేట పక్కన ఉన్న తాళ్ళ ఖమ్మంపాడు.

2) ఈయన విద్యాభ్యాసం మొత్తం సూర్యాపేట లోనే జరిగింది. ఈయన స్టీల్, ఐరన్, కన్స్ట్రక్షన్ ల బిజినెస్ లో బాగా రాణించారు.అయినప్పటికీ వ్యవసాయం చేయడం కూడా ఈయనకి బాగా ఇష్టం.

3)మరోపక్క సినిమాల పై ఉన్న ప్యాషన్ తో ఈయన.. ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నిర్మాణ రంగంలోని మెళుకువలను తెలుసుకుని నిర్మాతగా మారారు.

4) ఈయన తొలి చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకుడు.

5) అటు తర్వాత ఈయన ‘జయ జానకి నాయక’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. ఆ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు.

6) ఈయన మూడో చిత్రాన్ని మళ్ళీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేశారు. అదే ‘అఖండ’ చిత్రం.

7)2018లో ఈ కథని బోయపాటి కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలకి వినిపించారు. కానీ మిర్యాల రవీందర్ రెడ్డి గారు నిర్మించడానికి ముందు రావడంతో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళింది.

8)భారీ బడ్జెట్ పెడుతున్న తరుణంలో కూడా ఆయన భయపడలేదట. ఈ చిత్రం రిలీజ్ టైములో ఎంత బిజినెస్ చేస్తుంది అనే విషయాన్ని కూడా ఆయన ముందుగానే అంచనా వేసారట.

9) మొదటి నాలుగు రోజుల్లోనే ‘అఖండ’ బయ్యర్స్ అంతా సేఫ్ జోన్ కి వెళ్ళడం జరుగుతుందని కూడా ఈయన ముందుగానే అంచనా వేసారట.

10)’అఖండ’ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ అని.. ‘అఘోర’ పాత్రకి అందరూ బాగా కనెక్ట్ అవుతారని… అందుకే మిర్యాల రవీందర్ ఈ ప్రాజెక్టుని అంత ధీమాగా నిర్మించడానికి రెడీ అయ్యారు.

11) హిందీ ప్రేక్షకులకి కూడా ఈ చిత్రాన్ని చూపించాలని మిర్యాల రవీందర్ ప్లాన్ చేస్తున్నారు. డబ్బింగ్ చేయాలా, రీమేక్ చేయాలా అనే ఆలోచనలో ఆయన ఉన్నారు.

12) ‘అఖండ’ ని హిందీలో కనుక రీమేక్ చేస్తే.. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తే బాగుంటుందని మిర్యాల రవీందర్ అభిప్రాయం.

13) మార్చిలో ఈయన బ్యానర్‌లో కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తారట.దానికి సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తారు. అంతేకాకుండా అల్లు అర్జున్- బోయపాటి ల కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి కూడా ఈయన ఓ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.

Share.