లయ రీ ఎంట్రీ పై ఆసక్తికరమైన సంగతులు..!

సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పట్లో వరుస సినిమాలతో.. అందులోనూ వరుస హిట్లతో దూసుకొచ్చింది. ‘స్వయంవరం’ ‘మనోహరం’ ‘ప్రేమించు’ ‘దేవుళ్ళు’ ‘హనుమాన్ జంక్షన్’ ‘శివ రామ రాజు’ ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి చిత్రాలతో హిట్లందుకుని అప్పటి స్టార్ హీరోయిన్లకు సైతం వణుకు పుట్టించింది. స్టార్ హీరో బాలకృష్ణ నటించిన ‘విజయేంద్ర వర్మ’ చిత్రంలో కూడా నటించింది. అయితే తరువాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే.. ఈ బ్యూటీ అంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. అలాంటి ఈ హీరోయిన్ ఎందుకు సినిమాలకు గుడ్ బై చెప్పినట్టు అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. హీరో శివాజీతో చేసిన ‘అదిరిందయ్యా చంద్రం’ చిత్రం తర్వాత ఈమెకు అవకాశాలు బాగా తగ్గుతూ వచ్చాయట. ఆ క్రమంలో పలు మలయాళం,తమిళ్, కన్నడ సినిమాల్లో నటించినా అక్కడ కూడా సేమ్ రిజల్ట్. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. ఓ ఎన్నారై ను పెళ్ళి చేసుకుంది. లయ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యింది.

అక్కడ తన భర్త బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుంది. ఈమెకు ఓ పాప, బాబు. ఈమె కూతురు కూడా రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో చిన్నప్పటి హీరోయిన్ పాత్రను పోషించింది. ఇక లయ కూడా ఎన్టీఆర్- త్రివిక్రమ్ ల ‘అరవింద సమేత’ లో నటిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి కానీ.. ఆమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. మరి తెలుగు సినిమాలకు.. ఈమె రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేదో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus