సినీ పరిశ్రమలో సక్సెస్ ఉంటే.. అందరూ ఆకాశానికెత్తేశారు. అదే ప్లాప్ పడింది అంటే.. పాతాళానికి తొక్కేస్తారు. అలాంటి పీక్స్ చూసిన వారిలో అమ్మ రాజశేఖర్ (Amma Rajashekhar) ఒకరు. కొరియోగ్రాఫర్ గా స్టార్ అయ్యారు ఈయన. ప్రభాస్ (Prabhas), ఎన్టీఆర్(Jr NTR) , అల్లు అర్జున్ (Allu Arjun) వంటి స్టార్ హీరోలతో పనిచేశారు. వాస్తవానికి అమ్మ రాజశేఖర్ హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారు. అది వర్కౌట్ కాలేదు. కానీ కొరియోగ్రాఫర్ గా స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు. తన ఇంట్లో ఫంక్షన్ అంటే స్టార్ హీరోలు అంతా వచ్చే రేంజ్లో మంచి పేరు సంపాదించుకున్నారు.
అదే ఉత్సాహంతో దర్శకుడిగా మారాలని ప్రయత్నాలు చేశారు. ఈ దశలో గోపీచంద్ (Gopichand) ఛాన్స్ ఇచ్చారు. అలా చేసిన ‘రణం’ (Ranam) సూపర్ హిట్ అయ్యింది. 2006 ఫిబ్రవరి 10న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా విడుదలై 19 ఏళ్ళు పూర్తి కావస్తోంది. వాస్తవానికి ఈ సినిమా విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అమ్మ రాజశేఖర్ రాసుకున్న మాస్ ఎలిమెంట్స్ కి హీరో గోపీచంద్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.
అందువల్ల బి, సి సెంటర్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.ఇదిలా ఉండగా.. ‘రణం’ కంటే ముందు ఎన్టీఆర్ కి ఒక కథ చెప్పారట అమ్మ రాజశేఖర్. కానీ ఎన్టీఆర్.. దర్శకుడిగా అనుభవం లేని అమ్మ రాజశేఖర్ అంత పెద్ద కథని హ్యాండిల్ చేస్తాడా? అని ‘తర్వాత చూద్దాం’ అని పక్కనపెట్టాడట. అయితే ‘రణం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. దీంతో వెంటనే ఎన్టీఆర్ నుండి పిలుపు వచ్చింది.
అప్పటికే 2 సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్… అమ్మ రాజశేఖర్ ప్రాజెక్టును కూడా ఓకే చేసేశాడట. మధ్యలో రవితేజతో (Ravi Teja) ‘ఖతర్నాక్’ చేసే ఛాన్స్ కూడా అమ్మ రాజశేఖర్ కి వచ్చింది. అయితే అదే ఏడాది రిలీజ్ అయిన ‘ఖతర్నాక్’ (Khatarnak) ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత నితిన్ తో (Nithin) చేసిన ‘టక్కరి’ (Takkari) కూడా ప్లాప్ అయ్యింది. అందువల్ల అమ్మ రాజశేఖర్ ని ఎన్టీఆర్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టు స్పష్టమవుతుంది.